క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 మార్చి 26న ప్రారంభం కానుంది. కాగా ఈ ఏడాది కొత్తగా గుజరాత్ తో పాటు లక్నో రెండు ఫ్రొంచైజీలు ఆడబోతున్నాయి. మొత్తం 10 జట్లు ఈ సీజన్ లో పాల్గొననున్నాయి. గత సీజన్లో ఛాంపియన్స్‌గా నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్, రన్నరప్‌గా ఉన్న కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
అయితే ఈ లీగ్ లో విదేశీ ఆటగాళ్ల ప్రభావం చెప్పుకోవాలి. అందుకే వారిని జట్టు సభ్యలలో పరిధిని పెట్టారు. దీనితో విదేశీ ఆటగాళ్లను కోట్లు కుమ్మరించి మరి కొనుక్కున్నాయి. కానీ వారు నిలకడగా రాణిస్తారో లేదో చూడాలి. ఈ టోర్నీలో కొందరు విదేశీ ఆటగాళ్లు గాయం కారణంగా తప్పుకోగా.. మరికొందరు వారి దేశాలకు ప్రాతినిథ్యం వహిస్తూ ఐపీఎల్ తొలివారానికి దూరం కానున్నారు.
ఆస్ట్రేలియా ఆటగాళ్లు ఐపీఎల్ ప్రారంభ వారంలో పాల్గొనట్లేదు. ఆరోన్ ఫించ్, ప్యాట్ కమిన్స్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, హెజిల్వుడ్, మార్కస్ స్టోయినిస్ తొలి వారం ఐపీఎల్ మ్యాచులకు దూరం కానున్నారు. కైల్ మేయర్స్, అల్జారీ జోసెఫ్, జానీ బెయిర్‌స్టో.. ఐపీఎల్ ఆరంభ వారానికి అందుబాటులో ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఓపెనర్ జేసన్ రాయ్ ఐపీఎల్‌కు దూరం కాగా, పేసర్ మార్క్ వుడ్ గాయంతో టోర్నీ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు. వీరే కాగా మరికొంతమంది కొన్ని మ్యాచ్ లకు దూరం కానున్నారు.