బిగ్ బాస్ హౌస్ లోకి స్టార్ యాంకర్ ఎంట్రీ

బిగ్ బాస్ హౌస్ లోకి స్టార్ యాంకర్ ఎంట్రీ

0
100

స్టార్ మా లో ప్రసారమవుతున్న టీవీ గేమ్ షో బిగ్ బాస్. ఈ షో రోజురోజు కి ఎంతో ప్రేక్షకాదరణ పొందుతున్నది. ఇప్పటివరకు 10 వారలు పూర్తిచేసుకొని, ఎంతో కీలకమైన 11 వారంలోకి అడుగుపెట్టింది. హౌస్ మేట్స్ కి ఈవారం ఎంతో కీలకం కానుంది. నాని చెప్పినట్లు బిగ్ బాస్ హౌస్ లో ఏదైనా జరగవచ్చు అన్నట్టు ఎవరు ఊహించని విధంగా ఈ వారం ఎలిమినేషన్స్ కి దిగ్గజాలే రావడంతో ఈ షో ఇంకా రసవత్తరంగా సాగనుంది.

బిగ్ బాస్ హౌస్లోకి అప్పుడప్పుడు గెస్ట్ లు రావడం మాములే . ఈ రోజు బిగ్ బాస్ హౌస్లోకి తెలుగు టాప్ స్టార్ యాంకర్ అనసూయ, తనకెంతో ఇష్టమైన సుయ సుయ అనసూయ అంటూ డాన్స్ చేస్తూ హౌస్లోకి అడుగుపెట్టింది . ఒక్కసారిగా పాటని విన్న బిగ్ బాస్ సభ్యులు ఎవరొస్తున్నారో అని అందరూ డోర్ వైపు చూస్తూనే ఉన్నారు , అనసూయ డోర్ నుండి రావటం తో బిగ్ బాస్ సభ్యులు ఒక్కసారిగా ఆనందంతో ఆమెని ఎంతో ఆప్యాయంగా పలకరించారు. బిగ్ బాస్ మరింత ఆసక్తిగా ఈ రోజు ఎపిసోడ్ ఉండబోతుందని తాజా ప్రోమో చూస్తే తెలుస్తుంది. చుడాలిమరి బిగ్ బాస్ హౌస్ లో రంగమ్మత ఏంచేస్తుందో