IPL Today: నేడు మరో ఆసక్తికర పోరు..కోల్ కతా- పంజాబ్ ఢీ..!

0
105

ఐపీఎల్ 2022 రసవత్తరంగా సాగుతుంది. ఇప్పటికే జరిగిన అన్ని మ్యాచ్ లు కూడా ఫ్యాన్స్ ను థ్రిల్ చేశాయి. తాజాగా నేడు మరో ఆసక్తికర పోరుకు రెండు టీంలు అవుతున్నాయి. ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఈరోజు రాత్రి 7:30 గంటలకు కోల్‌కతా, పంజాబ్ జట్ల మధ్య మ్యాచ్ ఆరంభం కానుంది.

మ్యాచ్​లో చెన్నై సూపర్ కింగ్స్ పై ఘనవిజయం సాధించి శుభారంభం చేసింది కోల్ కతా. మరోవైపు ఆడిన తొలి మ్యాచ్‌లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ధేశించిన 206 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి అద్భుత విజయాన్ని అందుకుంది పంజాబ్. మరి ఈ జట్ల బలా బలాలు ఇప్పుడు చూద్దాం..

కోల్ కతా:

విద్వంసకర ఆటగాడు రస్సెల్ గాయపడడం జట్టుకు పెద్ద దెబ్బ.

కోల్‌కతా ఓపెనర్లు అజింక్య రహానే, వెంకటేష్ అయ్యర్‌ పవర్ ప్లేలో రన్స్ రాబట్టాలి.

సామ్ బిల్లింగ్స్, షెల్డన్ జాక్సన్, ఆండ్రీ రస్సెల్ భారీ ఇన్నింగ్స్ బాకీ ఉన్నారు.

పేసర్ ఉమేష్ యాదవ్ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ రాణించాడు. అతడికి తోడు టిమ్‌ సౌథీ కూడా రాణిస్తే తిరుగుండదు.

శ్రేయాస్, రాణా ఇంకా రాణించాల్సి ఉంది.

మిస్టరీ స్పిన్నర్‌ వరుణ్‌ చక్రవర్తి ఫామ్ లేమి.

పంజాబ్:

206 పరుగుల లక్ష్యం. అలాంటి స్కోర్ ను చెందించింది పంజాబ్. కెప్టెన్​ మయాంక్, శిఖర్ ధావన్, భానుక రాజపక్సలు అద్భుతంగా రాణించారు. వారితో పాటు చివర్లో ఒడెన్ స్మిత్, షారుఖ్ ఖాన్ ఆ మ్యాచ్​లో చెలరేగిపోయారు.

దక్షిణాఫ్రికా పేసర్ కగిసో రబాడ జట్టులో చేరడం అదనపు బలం.

సందీప్ శర్మ, రాహుల్ చాహర్, హర్‌ప్రీత్ బ్రార్‌లు రాణించాల్సి ఉంది.