ఆగష్టు 15 సందర్భంగా ఫ్యాన్స్ కి గిఫ్ట్ ఇవ్వనున్న ఎన్టీఆర్

ఆగష్టు 15 సందర్భంగా ఫ్యాన్స్ కి గిఫ్ట్ ఇవ్వనున్న ఎన్టీఆర్

0
104

ఎన్టీఆర్ తన అభిమానుల కోసం అరవింద సమేత చిత్రo టీజర్ ని రెడీ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాడు . ఆగష్టు 15న టీజర్ ని రిలీజ్ చేయనున్నారు . త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం రాయలసీమ నేపథ్యంలో రూపొందుతున్న విషయం తెలిసిందే . ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యాక్షన్ తో పోరాడిన తాలూకు స్టిల్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . దాంతో పాటు పలు స్టిల్స్ లీక్ అయి ఆ చిత్ర బృందాన్ని కలవరపాటు కి గురిచేశాయి .

ఇప్పటికే 70 శాతం కు పైగా షూటింగ్ పూర్తిచేసుకున్న అరవింద సమేత వీర రాఘవ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 10 న భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్టున్నారు . ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డే , ఈషా రెబ్బా నటిస్తుండగా కీలక పాత్రల్లో జగపతిబాబు , నాగబాబు లు నటిస్తున్నారు . ప్రస్తుతం భువనగిరి పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా పై ఎన్టీఆర్ , త్రివిక్రమ్ లతో పాటుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎన్నో ఆశలు పెట్టుకున్నారు . టీజర్ తో ఫ్యాన్స్ ని సంతోషంలో ముంచెత్తడానికి సన్నాహాలు చేసున్నారట . ఆగస్టు 14 సాయంత్రం లేదా ఆగస్టు 15 ఉదయం టీజర్ ని విడుదల చేయనున్నారు అరవింద సమేత చిత్ర బృందం .