ఐపీఎల్‌లోకి ఆసీస్‌ స్టార్‌ పేసర్‌ రీ ఎంట్రీ..వేలంలో భారీ ధర ఖాయం!

Aussie star pacer re-entry into IPL

0
94

ఐపీఎల్‌ 15వ సీజన్‌ను భారత్‌లో నిర్వహించేందుకే బీసీసీఐ మొగ్గు చూపుతుందని, విదేశాల్లో నిర్వహించడాన్ని ఆప్షన్‌గా ఉంచుకుందని ఈ వ్యవహారాలకు సంబంధించిన ఓ ఉన్నతాధికారి తాజాగా జాతీయ మీడియాకు వెల్లడించారు.

భారత్‌లో రాబోయే రోజుల్లో కరోనా తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో టోర్నీ నిర్వహణ ఇక్కడ కష్టంగా మారితే.. ప్రత్యామ్నాయంగా విదేశీ వేదికలను సైతం ఎంచుకునే వీలుందని ఆయన వివరించారు. అంతకంటే ముందు ఐపీఎల్‌ మెగా వేలంపైనే బీసీసీఐ ప్రధానంగా దృష్టిసారించిందని పేర్కొన్నారు. మరోవైపు ఈ ఏడాది కొత్తగా రెండు జట్లు మెగా ఈవెంట్‌లో పాలుపంచుకుంటుండగా ఆటగాళ్ల వేలం ఆలస్యం కానుంది.

తాజాగా ఈ వేలంలో ఆస్ట్రేలియా పేసర్‌ మిచెల్‌ స్టార్క్‌ సుముఖంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్యాష్‌ రిచ్‌ లీగ్‌లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమతున్నట్లు సమాచారం. కాగా చివరిసారిగా 2015లో ఐపీఎల్‌లో ఆడాడు స్టార్క్‌. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు తరఫున బరిలోకి దిగాడు. ఆ తర్వాత పనిభారం తగ్గించుకునే క్రమంలో క్యాష్‌ రిచ్‌ లీగ్‌ నుంచి నిష్క్రమించాడు.

ఈ మేరకు క్రిక్‌బజ్‌తో అతడు మాట్లాడుతూ… ‘‘పేపర్‌వర్క్‌ పూర్తి చేసుకోవడానికి కొంత సమయం పడుతుంది. ఇప్పటివరకైతే నా పేరు నమోదు చేసుకోలేదు. పోటీలో మాత్రం ఉంటాననే భావిస్తున్నా. మరో రెండు రోజుల్లో ఈ విషయంపై నిర్ణయం తీసుకుంటాను’’ అని పేర్కొన్నాడు.