బాబుకి మరో షాకిస్తున్న వైసీపీ – బీజేపీ

బాబుకి మరో షాకిస్తున్న వైసీపీ - బీజేపీ

0
86

తెలుగుదేశం పార్టీకి ప్రతిపక్షహొదా కూడా దక్కకుండా చేయాలని చూస్తున్నారనే వార్తలు ఏపీలో వినిపిస్తున్నాయి.. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీకి వంశీ రాజీనామాతో అసెంబ్లీలో ఎమ్మెల్యేల సంఖ్య 22 కి పడిపొయింది, అయితే కనీసం పదిశాతం సీట్లు సంపాదించుకోవాలి అంటే 175 కి పదిశాతం అంటే 18 సీట్లు రావాలి.. కాని ఇప్పుడు బాబుకి మరో 4 మాత్రమే సీట్లు అధికంగా ఉన్నాయి.. ఈ సమయంలో పార్టీ మారిపోవడానికి గంటాతో పాటు మరో ఇద్దరు ఉత్తరాంధ్రా నేతలు రెడీగా ఉన్నారు.

వీరు పార్టీ మారితే ఇక కేవలం తెలుగుదేశం పంచన 18 మంది ఉంటారు వీరిలో మరొకరు పార్టీ మారితే ప్రధాన ప్రతిపక్షహోదా తెలుగుదేశం పార్టీ పొగొట్టుకుంటుంది. అయితే ఇది వైసీపీ టార్గెట్ అనేకాదు బీజేపీ ఎత్తులు ఉన్నాయి అని తెలుస్తోంది, ప్రస్తుతం కొంతమంది బీజేపీ పంచన చేరాలని చూస్తున్నారు. దీంతో రాజకీయంగా తెలుగుదేశం పార్టీకి విషమ పరీక్షలు అని అంటున్నారు.. మరో పక్క తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు ఎటువైపు డోర్లు తెరిచి లేవు అనేది తాజాగా తెలుస్తోంది.