తెలుగులో మరో భారీ మల్టీస్టారర్ మూవీ

తెలుగులో మరో భారీ మల్టీస్టారర్ మూవీ

0
104

ప్రస్తుతం మహేష్ బాబు మహర్షి సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు . వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు . కాగా ఆ సినిమా తర్వాత సుకుమార్ దర్శకత్వంలో తన 26 వ సినిమాని చేయడానికి డేట్లు ఇచ్చాడు మహేష్ . అయితే మహేష్ – సుకుమార్ ల కాంబినేషన్ లో ఇంతకుముందు ” 1” నేనొక్కడినే చిత్రం వచ్చిన విషయం తెలిసిందే . అది డిజాస్టర్ కావడంతో మహేష్ తో పాటు అభిమానులు కూడా నిరుత్సాహానికి గురయ్యారు .

ఆ సినిమా ఇచ్చిన షాక్ తో ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట సుకుమార్ . ఇక ఈ సినిమాలో మహేష్ బాబు తో పాటుగా కీలక పాత్రలో మరో స్టార్ హీరో కావాలని అందుకు ప్రభాస్ లేదా ఎన్టీఆర్ లలో ఎవరో ఒకరిని తీసుకోవాలని భావిస్తున్నాడట సుకుమార్ .