మళ్లీ ఫామ్ లోకి వచ్చిన బండి సంజయ్ : కేసిఆర్ తిట్ల దాడి

0
87

బిజెపి రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ ఇటీవల కాలంలో ఇనాక్టీవ్ అయ్యారు. కారణాలు తెలియదు కానీ.. ఆయన గతంలో మాదిరిగా కేసిఆర్ మీద విరుచుకుపడడంలేదు. అయితే కృష్ణా జలాల వివాదం, హుజూరాబాద్ ఎన్నికల నేపథ్యంలో మళ్లీ సంజయ్ ఫామ్ లోకి వచ్చారు. బండి సంజయ్ మంగళవారం మీడియా సమావేశంలో సిఎం కేసిఆర్ పై విరుచుకుపడ్డారు. సంజయ్ కామెంట్స్…

తెలంగాణ ఉద్యమంలో నీళ్లు-నిధులు-నియామకాలు అనేది నినాదం. అట్లాంటి మొదటి నినాదమైన నీళ్లను ఆంధ్రాకు అమ్మేసి తెలంగాణ నోట్లో కేసీఆర్ మట్టి కొట్టిండు. తెలంగాణ నెంబర్ 1 ద్రోహి కేసీఆర్.

మొదటి అపెక్స్ కమిటీలోనే ఆంధ్రాకు 512 టీఎంసీలిచ్చి, తెలంగాణకు 299 టీఎంసీలకు ఒప్పుకుని ద్రోహం చేసిండు. ఏ సోయితో 299 టీఎంసీలకు ఒప్పుకున్నవ్?

క్రిష్ణా నదీ జలాల వాటా విషయంలో తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రులు కేసీఆర్డ్రామాలాడుతూ ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నరు. నీళ్లను ఆంధ్రాకు దోచిపెట్టడానికి 6 ఏళ్ళ క్రితమే పునాది పడింది.   * 2014-15 మధ్య కాలంలో 3 సార్లు సమావేశమై తెలంగాణా కు 299 టీఎంసీ ల నీటికి ఒప్పుకుండ్రు. కేంద్రం సమక్షంలో    తెలంగాణ ప్రభుత్వం సంతకాలు పెట్టింది ముమ్మాటికీ వాస్తవం. ఆధారాలు ఇవిగో(పత్రాలు చూపిస్తూ) 2019లోనే  నీటి వాటాలు, ఏపీ లో అక్రమ ప్రాజెక్టులకు కేసీఆర్, జగన్ మధ్య లోపాయికారీ ఒప్పందాలు జరిగినయ్.                             

ఎన్నికల ఖర్చు కోసం జగన్ కు  రూ.600 కోట్ల మేరకు  ఓ కాంట్రాక్టర్ ద్వారా కేసీఆర్ ఆర్దిక సాయం చేసిండు.

జగన్ అధికారంలోకొస్తే పోలవరంసహా ఏపీలోని ముఖ్యమైన ప్రాజెక్టులన్నింట్లో కమీషన్లను దొబ్బొచ్చని కేసీఆరే సలహా ఇచ్చిండు. అధికారంలోకి రాంగనే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల సీఎంలు వేల కోట్ల ప్రజాధనాన్ని ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకుంటున్నరు.

పోతిరెడ్డి పాడు విస్తరణ, సంగమేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణానికి పూర్తి సహకారం అందిస్తానని సీఎం కేసీఆర్ ఆనాడే జగన్ కు మాట ఇచ్చిన మాట వాస్తవం కాదా?

కృష్ణా నీటి కేటాయింపుల విషయంలో జగన్ ప్రతిపాదనకు తలొగ్గి తెలంగాణకు 34, ఆంధ్రాకు 66 శాతం నీటి కేటాయింపులకు అంగీకరించి తెలంగాణ నోట్లో మట్టి కొట్టిన దుర్మార్గపు ముఖ్యమంత్రి కేసీఆర్. సిగ్గులేకుండా మళ్లీ ప్రజలను రెచ్చగొడుతున్నడు.

2019 ఆగస్టు 12న నగరి ఎమ్మెల్యే రోజక్క ఇంట్లో రొయ్యల పులుసు తిని రాయలసీమను రతనాల సీమ చేస్తానని మాట ఇయ్యలేదా? సంగమేశ్వరం, పోతిరెడ్డిపాడు విస్తరణకు వాళ్లింట్లోనే అగ్రిమెంట్ చేసుకున్నవా?

ఏపీ ప్రభుత్వం ఏడాదిన్నర కాలంగా సంగమేశ్వరం, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు శరవేగంగా చేపడుతున్నా నోరు మొదపకుండా దక్షిణ తెలంగాణను ఎండబెడుతుండు.

కృష్టా నదిలో ఇప్పుడున్న వాటా(299 టీఎంసీలు)నే వాడుకోలేని అసమర్థ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యం ఫలితంగా గత రెండేళ్లలోనే నికర జలాల వాటాలోని 85 టీఎంసీల నీరు సముద్రంలోకి వ్రుథాగా వదిలేసి మాట వాస్తవం కాదా? ఈ నీటిని సక్రమంగా వినియోగించుకుని ఉంటే 8.5 లక్షల ఎకరాలకు సాగు నీరు అంది ఉండేది కాదా?

కాళేశ్వరం కంటే ఏడాది ముందే పాలమూరు-రంగారెడ్డి పనులకు శంకు స్థాపన చేసినా ఇంతవరకు పూర్తి చేయలేకపోయిన దద్దమ్మ కేసీఆర్

20 టీఎంసీల స్టోరేజీ లక్ష్యంగా మొదలైన కల్వకుర్తి రిజర్వాయర్ పనులు ఏళ్లుగా నత్తనడకన సాగుతున్నా పట్టించుకోకుండా సోయి తప్పిన కేసీఆర్.

పాలమూరు-రంగారెడ్డి, కల్వకుర్తి రిజర్వాయర్ పనులు పూర్తి చేసి ఉంటే దక్షిణ తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాల్లోని గ్రామాలన్నీ బంగారు పంటలతో కళకళలాడేవి కాదా?

తెలంగాణ ఏర్పాటై ఏడేళ్లయినా ఇంకా పాలమూరు, నల్గొండ జిల్లాలు ఫ్లోరైడ్ పీడత ప్రాంతాలుగానే ఉన్నాయంటే అది మీ చేతకానితనం కాదా?

నీటి కేటాయింపుల విషయంలో ఏపీ, తెలంగాణకు సమన్యాయం జరగాలని కేంద్ర జల మంత్రి గజేంద్ర షెకావత్ గారు రెండు సార్లు అపెక్స్ కౌన్సిల్ సమావేశ తేదీలను ఖరారు చేస్తే కుంటి సాకులు చెప్పి వాయిదా వేయించిన మాట నిజం కాదా కేసీఆర్?

చివరకు గత ఏడాది అక్టోబర్ 6న గజేంద్ర షెకావత్ గారు పట్టుబట్టి అపెక్స్ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తే జగన్ తో కుమ్మక్కై ఏపీ చేపట్టిన అక్రమ ప్రాజెక్టుల అంశాన్ని ప్రస్తావించకుండా మౌనంగా ఉన్న విషయం వాస్తవం కాదా?

తీరా ఇప్పుడు హుజూరాబాద్ ఉప ఎన్నిక వస్తుండటంతో జనాన్ని రెచ్చగొట్టేందుకే కేసీఆర్ నీటి డ్రామాలకు తెరదీస్తూ వచ్చే నెల 20 తరువాత క్రిష్ణా బోర్డు సమావేశం నిర్వహించాలంటూ తప్పును కేంద్రంపైకి నెట్టివేసే కుట్ర చేస్తుండు.   * స్పందించాల్సిన టైంలో స్పందించకుండా సోయి లేకుండా నిద్రపోయిండు. నష్టం జరిగిపోయాక తప్పును కేంద్రం పైకి నెడుతుండు.    ఇదంతా గమనించే krmb పరిధిని నోటిఫై చేయాలని నేనె కేంద్ర మంత్రికి లేఖ రాసిన.

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతి ఇవ్వొద్దంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేయడం పెద్ద డ్రామా. హుజూరాబాద్ ఎన్నికల్లో రాజకీయ లబ్ది కోసం తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టే కుట్రలో భాగమే.

ప్రశాంతంగా ఉన్న ఆంధ్రా, తెలంగాణ ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు శ్రీశైలం, నాగార్జున సాగర్, జూరాల ప్రాజెక్టుల వద్ద భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి గాయిగాయ్ చేస్తున్నవ్. అసలక్కడేం జరుగుతుందని పోలీస్ బందోబస్తు. అంతా ప్రశాంతంగా ఉన్న చోట పోలీసులను పెట్టి జనాలను భయపెట్టడమేంది?                                    హుజురాబాద్ ఎన్నికలు దగ్గర పడే కొద్దీ రెండు రాష్ట్రాల పోలీసులు కొట్టుకునేలా కొత్త డ్రామాలకు కేసీఆర్ తెరలేపబోతున్నడు.

మేం చెప్పిన ఈ విషయాలపై దమ్ముంటే శ్రీశైలం ప్రాజెక్టు వద్ద చర్చకు సిద్ధం. చేతనైతే కేసీఆర్  బహిరంగ చర్చకు రావాలి. మేం చెప్పినవన్నీ వాస్తవాలని నిరూపిస్తాం. తప్పయితే ముక్కు నేలకు రాయడమే కాదు శ్రీశైలం ప్రాజెక్టు నీళ్లలో దూకి చావడానికి మేం సిద్ధం? వాస్తవాలని నిరూపిస్థా. కేసీఆర్ చావాలనుకోవడం లేదు. ప్రజలకు తప్పయిందని ఒప్పుకుని  ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పాలి.

CM పదవికి రాజీనామా చేయాలి.   హుజురాబాద్ లో ఓడిపోతామనే కేసీఆర్ డ్రామాలడుతుండు. ఉద్యమకారుడు ఈటల రాజేందర్ గెలుపు ఖాయం. హుజురాబాద్ ప్రజలు డబ్బులకు అమ్ముడుపోయే వాళ్ళు కాదు. కేసీఆర్ కు కర్రు కాల్చి వాతపెట్టబోతుండ్రు.