సినిమాలకి గుడ్ బై ?

సినిమాలకి గుడ్ బై ?

0
114

తన కామెడీ తో నవ్వులు పండిస్తున్న మహా నవ్వుల కిరిటీ బ్రహ్మపుత్ర బ్రహ్మీ….గిన్నిస్ బుక్ రెకార్డ్ హోల్డర్ సినిమాలకి ఇక గుడ్ బై చెప్పనున్నాడని ఫిలింనగర్ వర్గాల సమాచారం. తన నవ్వులతో గత 30 సంవత్సరాలుగా టాలీవుడ్ ప్రేక్షకులని మంత్రంముగ్దుల్ని చేస్తూవున్నాడు.

బ్రహ్మానందం ఒకప్పుడు ఈ పేరు సంచలనం. హీరోతో సంబంధం లేకుండా ఒక్క బ్రహ్మానందం ఉంటె చాలు సినిమా సూపర్ హిట్ అవుతుంది అనే నమ్మకం ఉండేది. తనదైన కామెడీ టైమింగ్ తో టాలీవుడ్ లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు.

ఇప్పుడు కొత్త కమెడియన్స్ టాలీవుడ్ లో చాలమంది పుట్టుకొచ్చారు. అలాగే బ్రహ్మీకామెడీ లో కొత్తదనం లేదని పెదవివిరుస్తున్నారు. దీనితో బ్రహ్మీ కి సినిమాలు కూడా చాల వరకు తగ్గిపోయాయి. ఈ సందర్భం లో బ్రహ్మీ సినిమాలకి ఇక గుడ్ బై చెప్పనున్నాడని ఇప్పటికే నెట్లో వైరల్ గా మారింది.