రైతులకు కేంద్రం గుడ్ న్యూస్..మరో రెండు పథకాలకు శ్రీకారం

0
121

రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. తాజాగా మరో రెండు పథకాలను తీసుకురానున్నట్టు తెలిపారు. ‘ఒక దేశం.. ఒకటే ఎరువు’ అనే నినాదంతో ఇకపై ఎరువులన్నింటికీ ఒకటే బ్రాండు ఉండనుంది. పీఎంబీజేపీ ప్రకారం అన్ని రకాల ఎరువులను కంపెనీలు ఇక ఒకటే బ్రాండుతో మార్కెట్‌లో అమ్మాలని కేంద్రం నిర్ణయించింది.

ఎరువులన్నింటికీ ఒకటే బ్రాండుగా ప్రధానమంత్రి భారతీయ జనఉర్వారక్‌ పరియోజన(పీఎంబీజేపీ)గా వ్యవహరిస్తారు. అలాగే గ్రామస్థాయిలో ఎరువుల దుకాణాలు ప్రధానమంత్రి కిసాన్‌ సమృద్ధి కేంద్రాలుగా ఆవిర్భవిస్తాయి. భారత్‌ యూరియా, భారత్‌ డీఏపీ, భారత్‌ మ్యూరేట్‌ ఆఫ్‌ ఫొటాష్‌(ఎంఓపీ), భారత్‌ ఎన్‌పీకే.. ఇలా ఉండాలి. ఇంతకాలం ఒక్కో కంపెనీ ఒక్కో పేరుతో ఎరువులను ప్రత్యేక బ్రాండ్లతో విక్రయిస్తున్నాయి. ఇకనుంచి అలా కుదరదని కేంద్రం స్పష్టం చేస్తూ బుధవారం ఉత్తర్వులిచ్చింది.

అక్టోబరు 2న గాంధీ జయంతి రోజు నుంచి ‘భారత్‌ బ్రాండు’ పేరుతో ముద్రించిన ఎరువులను మార్కెట్‌లో విక్రయించడం ప్రారంభించాలని స్పష్టం చేసింది. అయితే ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న పాత బ్రాండ్ల బస్తాలన్నింటినీ డిసెంబరు 31లోగా అమ్మేయాలి. ఆ తరవాత ఇక ఎక్కడా పాత పేర్లతో ఎరువు బస్తా సంచులు మార్కెట్‌లో కనపడకూడదు. భారత్‌ బ్రాండువే ఉండాలి’’ అని వివరించింది.