తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షులు డా.చెరుకు సుధాకర్ రాజకీయ నాయకులపై తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ తెచ్చినమన్న టీఆర్ఎస్ పార్టీ పుట్టి 21 సంవత్సారాలు పూర్తి చేసుకోబోతున్నది. తెలంగాణ రాష్ట్రం ఇచ్చినామన్న కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లును నెగ్గించి, కొత్త రాష్ట్రం ప్రకటించి దాదాపు 8 సంవత్సరాలు పూర్తయింది. సుష్మాస్వరాజ్ లేకుంటే తెలంగాణ వచ్చేదా అని అమాయకంగా ప్రశ్నించే బండి సంజయ్ బిజెపి పార్టీ రెండు సార్లు గెలిచి కాంగ్రెస్, టీఆర్ఎస్, ఇతర వర్గాల ప్రజలు నుండి ప్రస్తుతం తీవ్ర విమర్శలు తలెత్తుతున్నాయి. వాటన్నిటిని ఎదుర్కుంటూ బిజెపి పార్టీ నానాతంటాలు పడుతున్నారు.
నరేంద్ర మోడీకి గెలుపుకు పని చేసిన ప్రశాంత్ కిశోర్ ఐ ప్యాక్ సంస్థ పేరేతో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, బెంగాల్‌లో ఎన్నికల వ్యూహాలు రచించి, ఆయా పార్టీల గెలునకు సహకారం అందించడంలో, ఢిల్లీలో తెలంగాణ గల్లీల్లో ఆయన పేరు మారుమ్రోగుతున్నది. తెలంగాణ ఉద్యమ, సామాజిక శక్తులు ఇరుసుగా కొనసాగవలసిన తెలంగాణ ఎన్నికల రాజకీయాల్లో వ్యూహకర్తలకు గిరాకి కొత్త సవాళ్ళు విసురుతున్నది. తెలంగాణను వ్యతిరేకించిన రాజశేఖర్‌రెడ్డి బిడ్డ షర్మిల ఒక వైపు, తల్లిని చంపి బిడ్డను వేరు చేసిండ్రని తెలంగాణను కించపరిచే నరేంద్ర మోడీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరో వైపు తెలంగాణ అస్తిత్వాన్నే సవాలు చేస్తున్నారు. యస్.సి, బి.సీ సంఘాలు జయంతులు, వర్ధంతులు, దళిత బంధు, రాయితీల చుట్టు తిరుగుతుంటే తెలంగాణ ఉద్యమకారులు రాజకీయ శక్తిగా సంఘటితం కాక నిస్ప్నహలో ఉన్నారు.
ఇప్పుడు పీ.కే సేవలు కావాలని ఆరాటపడుతున్న టి ఆర్ యస్, కాంగ్రెస్‌లు తెలంగాణ రాష్ట్ర ఆవతరణ తరువాత రాజకీయంగా ఉద్యమ, సామాజిక శక్తులకు ఏమి భరోస ఇవ్వగలవు అని ప్రశ్నించాడు. తెలంగాణ సబ్బండ వర్గాల విశ్వాసం పొందితే ఈ పార్టలకు గెలుపు అంతా కష్టమేమి కాదని అయన తెలిపాడు. ఒక్కనాడు గౌరవప్రదంగా ఈ వర్గాల నుండి అభిప్రాయాలు సేకరించక పీకే తో సోషల్ మీడియాలో, నాయకులతో రోడ్ల మీద ఘర్జనలు, సభలు, బలప్రదర్శనలతో ఎంత హడావుడి చేసినా ఏమి ప్రయోజనం ఉండదని హెచ్చరించారు. అసంతృప్తితో రగులుతున్న ఈ వర్గాల కలపుకొని పోయే ప్రయత్నాలు చేయకుండా ఈ విధంగా ఉండడం మా వర్గాలకు అవమానంగా భావిస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేసాడు.