కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో టిఆర్ఎస్ ఎంపీ భేటీ

0
103
MP Ranjith Reddy

కేంద్ర మంత్రిగా పదోన్నతి పొంది బాధ్యతలు తీసుకున్న కిషన్ రెడ్డితో టిఆర్ఎస్ ఎంపీ (చేవెళ్ల) డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి భేటీ అయ్యారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తరుణంలో శుభాకాంక్షలు తెలిపారు.

కేంద్ర పర్యాటక మంత్రిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన జీ కిషన్ రెడ్డిని టీఆర్ఎస్, చేవెళ్ల ఎంపీ డాక్టర్ జి. రంజిత్ రెడ్డి దేశ రాజధాని ఢిల్లీలో గురువారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కేంద్రం నుండి తెలంగాణకి రావాల్సిన అంశాలపై కృషి చేయాలని మంత్రిని ఎంపీ విజ్ఞప్తి చేశారు. చేవెళ్ల పార్లమెంట్ పరిధిలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రిని ఆయన కోరారు.