త్వరలో సెట్స్ పైకి రానున్న మెగాస్టార్ 152 వ సినిమా

త్వరలో సెట్స్ పైకి రానున్న మెగాస్టార్ 152 వ సినిమా

0
105

ప్రస్తుతం సైరా మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు మెగాస్టార్ . ఈ మూవీ అవుతూండగానే కొత్త సినిమాను లైన్లో పెట్టేశారు మెగాస్టార్. డైరెక్టర్ కొరటాల శివ ఇప్పటికే భరత్ అను నేను సినిమాతో లేటెస్ట్ హిట్ కొట్టి ఊపు మీద ఉన్నాడు. తన నెక్స్ట్ చిత్రం చిరంజీవిదేనని పట్టు మీదున్న కొరటాలకు చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడని ఫిల్మ్ నగర్ టాక్.

దాంతో చిరు మూవీ మీదే ఫుల్ ఫోకస్ పెట్టిన కొరటాల పక్కాగా స్క్రిప్ట్ రెడీ చేసుకున్నారు. చిరు డేట్లు ఇవ్వడమే తరువాయి షూటింగ్ అంటున్నారు. ఇంతకీ విశేషమేంటంటే ఈ మూవీకి కూడా రాం చరణ్ నిర్మాతట. చిరు పక్కన ఎవరు హీరోయిన్ అన్నది ఫైనలైజ్ కాలేదు కానీ ఓ క్రేజీ బ్యూటీ కోసం కొరటాల సెర్చ్ చేస్తున్నట్లు ఫిల్మ్ నగర్ టాక్.