అందుకు ఒప్పుకోకపోతే ఇండస్ట్రీ నుండి వెళ్లిపోవాల్సిందే..

అందుకు ఒప్పుకోకపోతే ఇండస్ట్రీ నుండి వెళ్లిపోవాల్సిందే..

0
80

సినిమాల్లో నటించాలని నిర్ణయం తీసుకుంటే అన్నిటికి తెగించి రావాల్సిందే నని , ఒకవేళ అందుకు ఒప్పుకోకపోతే ఇండస్ట్రీ నుండి వెళ్లిపోవాల్సిందే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది రాయ్ లక్ష్మి . తమిళ , తెలుగు , హిందీ చిత్రాల్లో నటించిన ఈ భామ హాట్ ఇమేజ్ తెచ్చుకుంది . అయితే ఏ భాషలో కూడా సక్సెస్ ఫుల్ హీరోయిన్ కాలేకపోయింది దాంతో ఐటెం సాంగ్స్ చేస్తూ రాణిస్తోంది రాయ్ లక్ష్మి . ఇక గతకొంత కాలంగా కాస్టింగ్ కౌచ్ ఆరోపణలతో ఫిలిం ఇండస్ట్రీ అట్టుడికి పోతోంది , ఇప్పటికే ఓసారి ఈ కాస్టింగ్ కౌచ్ పై స్పందించగా తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసింది .

హీరోయిన్ గా నటించాలంటే కాస్టింగ్ కౌచ్ కు బలి కావాల్సిందే అని , ఒకవేళ మనకు ఇష్టం లేకపోతే ….. దాని వల్ల అవకాశాలు రాకపోతే తిరిగి ఇంటికి వెళ్లిపోవాల్సిందే అని అంటోంది . కొత్తగా వచ్చే వాళ్లకు ఈ ఇబ్బందులు తప్పడం లేదని అయితే నాకు మాత్రం ఇలాంటి ఇబ్బందులు తలెత్తలేదని కానీ కొంతమంది ని చూశానని , అలాగే చెప్పుకుంటుంటే విన్నానని అంటోంది రాయ్ లక్ష్మి . అంటే ఈ భామ చెబుతున్న దాని ప్రకారం పక్కలో పడుకుంటేనే ఛాన్స్ ఇస్తున్నారు అని మరోసారి రూఢీ అయ్యింది .