Flash- ఆసీస్ క్రికెటర్ కు కరోనా పాజిటివ్..నాలుగో టెస్టుకు దూరం

Corona positive for Aussie cricketer

0
91

యాషెస్​ సిరీస్ లో కరోనా కలకలం రేపుతోంది. తాజాగా ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రెవిస్ హెడ్​కు పాజిటివ్​గా నిర్ధారణ అయింది. దీంతో అతడు నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. తొలి టెస్టులో సెంచరీతో ఆసీస్ విజయంలో కీలకపాత్ర పోషించాడు హెడ్. “దురదృష్టవశాత్తు హెడ్​కు కరోనా పాజిటివ్​గా తేలింది. ప్రస్తుతం అతడిలో ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదు. ఐదో టెస్టులో ఆడతాడని భావిస్తున్నాం” అని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఓ ప్రకటనలో తెలిపింది.