క్రికెట్ చరిత్రలో ఈ అవుట్ హిస్టరీ – ఒకే బాల్ రెండు అవుట్స్ – వీడియో ఇదే

క్రికెట్ చరిత్రలో ఈ అవుట్ హిస్టరీ - ఒకే బాల్ రెండు అవుట్స్ - వీడియో ఇదే

0
126

ఐపీఎల్ 2020 మ్యాచులు రసవత్తర పోటీని తలపిస్తున్నాయ, కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్నారు ఆటగాళ్లు, అంతేకాదు బ్యాట్స్ మెన్స్ చెలరేగిపోతున్నారు. సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగిన మ్యాచ్లో రషీద్ ఖాన్ ఔట్ తీరు అందర్ని ఆశ్చర్యపరుస్తోంది.

బహుశా ఇప్పటి వరకూ ప్రపంచంలో ఏ మ్యాచ్ లో కూడా ఇలా అవుట్ అయి ఉండదు అని.. ఇది ఓ రికార్డ్ అంటున్నారు క్రీడా అభిమానులు, నిజమే ఇలాంటివి చాలా అరుదుగా జరుగుతూ ఉంటాయి, అదే హిట్ వికెట్.ఒకే బంతికి రెండు సార్లు ఔట్ అయ్యాడు బ్యాట్స్ మెన్.

ఇక్కడ రషీద్ ఖాన్ అవుటైన తీరు అందరికి విస్మయం కలిగిచింది. శార్దుల్ ఠాకూర్ వేసిన 19వ ఓవర్లో చివరి బంతిని లో ఫుల్ టాస్గా వేశాడు. దీంతో రషీద్ ఖాన్ వికెట్లను దగ్గరగా వెళ్లి షాట్ ఆడాడు. ఆ క్రమంలోనే రషీద్ కాలు ఆఫ్ స్టంప్కు తగిలింది. అలాగే అతను కొట్టిన బంతి లాంగాన్లో ఉన్న ఫీల్డర్ దీపక్ చహర్ చేతుల్లో పడింది. ఇలా ఒకే బంతికి రెండు సార్లు అవుట్ అయ్యాడు రషీద్.

మీరు ఈ వీడియో లింక్ చూడండి