క్రికెటర్లకు హీరోయిన్లతో వల ఒకరు అరెస్ట్

క్రికెటర్లకు హీరోయిన్లతో వల ఒకరు అరెస్ట్

0
92

కర్ణాటక ప్రీమియర్ లీగ్ అనేక సంచనాలకు కేరాఫ్ అడ్రస్ అయింది, అయితే ఇందులో మ్యాచ్ ఫిక్సింగ్ జరిగింది అని ఆరోపణలు వచ్చాయి..అలాగే హీరోయిన్లతో క్రికెటర్లకు వలేశారు అనే విమర్శలు వినిపిస్తున్నాయి, దీనిలో భాగంగా అంతర్జాతీయ బుకీ జతిన్ తాజాగా అరెస్ట్ అయ్యారు.కొంతకాలంగా పోలీసులకి దొరకకుండా నెదర్లాండ్స్ లో తలదాచుకున్న నితిన్, బెంగళూరు విమానాశ్రయానికి వస్తున్నాడని తెలుసుకున్న పోలీసులు, అతను ల్యాండ్ అవ్వగానే అరెస్ట్ చేశారు.

దీంతో అతనే షాక్ అయ్యాడు,పలు కేపీఎల్ మ్యాచ్ లతో పాటు, ఇతర బెట్టింగుల్లోనూ అతనికి ప్రమేయం ఉందని, దీనిపై లోతుగా విచారిస్తున్నామని అన్నారు పోలీసులు. అయితే మీడియాకి మాత్రం పూర్తి వివరాలు వెల్లడించలేదు, అతని నుంచి పూర్తి వివరాలు డ్రాఫ్ట్ తయారు చేస్తున్నారు.

ఇందులో ఎవరి ప్రమేయం ఉంది సినీ రాజకీయ సెలబ్రెటీలు ఎవరైనా ఉన్నారా, ఇలా అనేక విషయాలు విచారణ చేస్తున్నారు. జతిన్ తో గతంలో సంబంధాలున్న ఆటగాళ్లు ఇప్పుడు తీవ్ర ఆందోళనలో పడ్డారట.మరి చూడాలి దీనిపై ఎలాంటి నిజాలు బయటకు వస్తాయో.