భారత్ ఘోర పరాజయం..సెమీస్ ఆశలపై నీళ్లు

Defeat of India..Semis hopes watered down

0
95

టీ20 ప్రపంచకప్​లో భాగంగా ఆదివారం జరిగిన మ్యాచ్​లో టీమ్​ఇండియాపై ఘన విజయం సాధించింది న్యూజిలాండ్. భారత్​ నిర్దేశించిన 111 పరుగుల లక్ష్యాన్ని రెండు వికెట్లు కోల్పోయి 14.3 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్​ మిచెల్​ 49 పరుగులతో అదరగొట్టి కివీస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.

తొలుత టాస్​ ఓడి బ్యాటింగ్​కు దిగిన భారత జట్టు ఆరంభంలోనే తడబడింది. ఇషాన్​ కిషన్, కేఎల్ రాహుల్ ఓపెనర్లుగా వచ్చినా జట్టుకు శుభారంభం దక్కలేదు. ఇషాన్​(4), కేఎల్​ రాహుల్(18), రోహిత్​ శర్మ(14), విరాట్​ కోహ్లీ(9) పరుగులతో పేలవ ప్రదర్శన చేశారు. అనంతరం రిషభ్ పంత్ 12 పరుగుల వద్ద మిల్నే బౌలింగ్​లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. చివరిదశలో హార్దిక్​ పాండ్య(23) పరుగులతో రాణించినా బౌల్ట్​ వేసిన ఓవర్లో ఔటయ్యాడు. జట్టులో అవకాశం దక్కించుకున్న శార్దూల్ ఠాకూర్ ఒక్క పరుగైనా చేయకుండానే పెవిలియన్ చేరాడు. చివర్లో రవీంద్ర జడేజా 26 పరుగులతో రాణించడం వల్ల గౌరవప్రదమైన స్కోరు నమోదైంది.

న్యూజిలాండ్ టీం ఓపెనర్లు మార్టిన్ గుప్తిల్(20 పరుగులు, 17 బంతులు, 3 ఫోర్లు), మిచెల్ (49 పరుగులు, 35 బంతులు, 4 ఫోర్లు, 3 సిక్సులు) భారత ఆశలపై నీళ్లు చల్లి, భారత బౌలర్లకు చుక్కలు చూపిస్తూ బౌండరీల వర్షం కురిపిస్తూ న్యూజిలాండ్ టీంను విజయం వైపు నడిపించారు. అయితే బుమ్రా బౌలింగ్‌లో శార్దుల్ ఠాకూర్‌కు క్యాచ్ ఇచ్చి మార్టిలన్ గుప్తిల్ పెవిలియన్ చేరాడు. ఆ ఆనందం భారత శిభిరంలో కొద్దిసేపు కూడా ఉంచకుండా చేశాడు మరో ఓపెనర్ మిచెల్. భారత బౌలర్లపై వీర విహారం చేస్తూ.. బౌండరీలు బాదుతూ కోహ్లీసేనను సెమీస్ నుంచి దూరం చేశాడు. వీరిద్దరు పెవిలియన్ చేరాక కెప్టెన్ విలియమ్సన్ 33, కాన్వే 2 మిగతా పనిని పూర్తి చేశారు. భారత బౌలర్లలో బుమ్రా ఒక్కడే 2 వికెట్లు తీశాడు.

ఈ మ్యాచ్ ఓటమితో టీమ్​ఇండియాకు సెమీస్​ ఆశలు గల్లంతయ్యాయి. మరో మూడు మ్యాచ్​లు గెలిచినా టీమ్​ఇండియా సెమీస్​ చేరడం కష్టమే.