బ్రేకింగ్ — క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

బ్రేకింగ్ -- క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన ధోనీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న

0
94

కెప్టెన్ కూల్ అనే ట్యాగ్ లైన్ ఉంది ధోనికి , మైధానంలో ప్ర‌శాంత‌మైన ఆట అత‌ని సొంతం..
నిజంగా ధోని అభిమానులు ఈ రోజు షాక్ అయ్యారు..టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇప్ప‌టి వ‌ర‌కూ కొద్ది రోజులుగా ధోని నుంచి ఈ వార్త వ‌స్తుంది అని అనేక వార్త‌లు వినిపించాయి.

తాజాగా ధోని దీనిపై క్లారిటీ ఇచ్చారు. 2019 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్ ఓటమి తర్వాత మైదానంలో అడుగుపెట్టలేదు ధోని.. ఏడాది సస్పెన్స్ తర్వాత ఆటకు వీడ్కోలు పలుకుతున్నానని స్పష్టంచేశాడు.
తన మనసులో మాట బయటపెట్టాడు.

ఇప్ప‌టికే టెస్టు క్రికెట్ నుంచి వైదొలిగినధోని .. పరిమిత ఓవర్ల క్రికెట్ నుంచి కూడా ఎలాంటి చడీ చప్పుడు లేకుండానే తప్పుకున్నాడు. రిటైర్మెంట్ పై ధోని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టాడు.
కెరీర్ లో నన్ను ప్రేమించి, నా వెన్నంట నిలిచిన ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు. 19:29 నుంచి నేడు వీడ్కోలు పలికినట్లుగా భావించండి అని అందులో రాసుకొచ్చాడు. దీంతో ధోని అభిమానులు షాక్ అయ్యారు, త‌న ఆట‌తో ప్ర‌త్య‌ర్దుల‌ను చిత్తు చేసిన బ్యాట్స్ మెన్, ఇక అంత‌ర్జాతీయ మ్యాచ్ లు ఆడ‌రు అంటే నిజంగా అభిమానుల‌కు షాక్ అనే చెప్పాలి.