ధోని ఇంటికి భారీ రిటైర్మెంట్ గిఫ్ట్ ?ఎవరిచ్చారంటే

ధోని ఇంటికి భారీ రిటైర్మెంట్ గిఫ్ట్ ?ఎవరిచ్చారంటే

0
104

అభిమానులని షాక్ కి గురిచేస్తూ భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే… ఇక ఐపీఎల్ లో మాత్రమే ఆయన కనిపించనున్నారు, ఇక ధోని హెలీకాఫ్టర్ షాట్స్ మిస్ అయ్యారు అభిమానులు, అయితే ఆయన ఈ రిటైర్మెంట్ నాడు ఓ అద్బుతమైన గిఫ్ట్ అందుకున్నట్లు తెలుస్తోంది.

పోంటియాక్ ఫైర్బర్డ్ ట్రాన్స్ యామ్తో ధోని తన రిటైర్మెంట్ను గొప్పగా చేసుకున్నట్లు తెలుస్తోంది. ధోని భార్య సాక్షి సింగ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ఈ కారు వీడియో ఫోటోలు పంచుకున్నారు…ఎరుపు రంగుతో ఉన్న ట్రాన్స్ యామ్ ధోని కార్ గ్యారేజీలో చేరింది.

ఇది చాలా ఖరీదైన కారు అంటున్నారు ఎక్స్ పెర్ట్ లు..పోంటియాక్ ఫైర్బర్డ్ ట్రాన్స్ యామ్ 1970 లలో తయారు చేసిన ఒక అమెరికన్ కారు. ఇప్పుడు చాలా రేర్ గా దొరుకుతున్నాయి. ఇది ఆనాటి కారు అని తెలుస్తోంది. స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఇది ధోని గ్యారేజ్ కు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక ధోని గ్యారేజీలో అనేక కార్లు బైక్ లు ఉన్న విషయం తెలిసిందే. అయితే ధోని భార్య ఈ కారుని గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది.