ధోని– రోహిత్ ఇద్ద‌రిలో ఎవ‌రు రికార్డ్ క్రియేట్ చేస్తారో

ధోని-- రోహిత్ ఇద్ద‌రిలో ఎవ‌రు రికార్డ్ క్రియేట్ చేస్తారో

0
106

ఈ ఐపీఎల్‌ సీజన్ స‌రికొత్త‌గా సాగుతోంది, ఊహించ‌ని వారు అద‌ర‌గొడుతున్నారు, ఆశ‌లు పెట్టుకున్న వారు మాత్రం త‌మ బ్యాట్ కు ప‌ని చెప్ప‌డం లేదు, అంతేకాదు రికార్డులు కూడా స‌రికొత్త‌గా న‌మోదు అవుతున్నాయి, ఇక మిస్ట‌ర్ కూల్ సీఎస్కే కెప్టెన్ ధోనీ స‌రికొత్త రికార్డు న‌మోదు చేసిన సంగ‌తి తెలిసిందే

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన‌ మ్యాచ్‌ ధోనికి 194వ ఐపీఎల్‌ మ్యాచ్ అయింది, ఇది ఇప్ప‌టి వ‌ర‌కూ రికార్డ్ అత్య‌ధిక మ్యాచ్ లు ఆడిన ఆట‌గాడిగా ఆ రికార్డు ధోనికి ఉంటుంది, అయితే రైనాతో స‌మానంగా అయ్యాడు ధోని రైనా కూడా 194 మ్యాచ్ లు ఆడాడు.

ఈ టోర్నీ ముగిసేవరకూ ధోని ఈ రికార్డును కొనసాగించాలంటే మాత్రం సీఎస్‌కే కనీసం ప్లేఆఫ్స్‌కు చేరాల్సి ఉంది. ఇక ఈ రికార్డుకి ద‌గ్గ‌ర్లో ఉన్న మ‌రో ఆట‌గాడు రోహిత్ శ‌ర్మ‌. 192 ఐపీఎల్‌ మ్యాచ్‌ల్ ఆడాడు.కింగ్స్‌ పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ ఐదు వేల పరుగుల క్లబ్‌లో చేరాడు.విరాట్‌ కోహ్లి, సురేశ్‌ రైనాల తర్వాత స్థానాన్ని ఆక్రమించాడు. మ‌రి ఛాన్స్ అయితే ధోనికి రోహిత్ కి ఉంది చూడాలి ఈ సీజ‌న్ లో ఎవ‌రు రికార్డ్ క్రియేట్ చేస్తారో.