ఎన్నో విజయాలు, ఎన్నో తీపి గుర్తులు , ఎన్నో ఉద్వేగ క్షణాలు, హెలీకాఫ్టర్ షాట్ లు, ఒక్క ఓవర్లో 15 రన్స్ కొట్టాలి అని ఉన్నా, అంతే కూల్ గా మ్యాచ్ ని ఫినిష్ చేస్తాడు ధోని, నిజమే ఇలాంటి ఆటగాడు భారత్ కు మళ్లీ దొరుకుతాడా అనే సందేహం అందరికి ఉంది.
ఈ సమయంలో ధోని గురించి ఓ వార్త వైరల్ అవుతోంది, ఇక ఆటగాడు బ్యాట్ పట్టుకుని బౌండరీలు కొట్టి విజయాలు అందిస్తే ఆ కిక్కే వేరు..2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ చివర్లో సిక్సర్‌తో జట్టును ధోనీ గెలిపించిన వైనం గుర్తుందిగా. ఆ రోజు ఎవరూ మర్చిపోలేరు.
అయితే ఆ సిక్స్ కొట్టిన బ్యాట్ ని తర్వాత వేలం వేశారు, అయితే ఆ బ్యాట్ ఎంత ధర పలికింద తెలుసా, మన కరెన్సీలో సుమారు 70 లక్షలు, ఇంత భారీ ధర రావడం ఇదే తొలిసారి, ఆనాడు ముంబైకి చెందిన బ్రోకరేజ్ ఫిర్మ్ ఆర్కే గ్లోబల్ దీనిని కొనుగోలు చేసింది. ప్రపంచకప్ జరిగిన మూడు నెలల తర్వాత లండన్‌లో జరిగిన ఓ ఛారిటీ డిన్నర్‌లో ఈ బ్యాట్‌ను వేలంవేశారు.