వైసీపీలోకి మ‌రో సీనియ‌ర్ నేత‌…మాజీ మంత్రి!

వైసీపీలోకి మ‌రో సీనియ‌ర్ నేత‌...మాజీ మంత్రి!

0
109

కడప జిల్లా ఈ జిల్లాని రాజకీయానికి కంచుకోటలాగా భావిస్తారు ఈ జిల్లా లో రాజకీయం గా మార్పులు జరుగుతున్నాయి .కడప జిల్లాలో చాల మంది ఉద్దండులైన నేతలు ఉన్నారు . వారిలో ఒకడు మాజీ మంత్రి ఎల్ రవీంద్రారెడ్డి. ఈయన రాష్ట్రం విడిపోయాక రాజకీయంగా క్రియాశీలంగా లేడు.2014 ఎన్నికల తరువాత పూర్తిగా సైలెంటయిపోయినా మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి వైసీపీలో చేరబోతున్నట్లు సమాచారం. ఇందుకు అన్ని పనులు సిద్ధమైనట్లు కొందరు నేతలు చూస్తున్నారు.వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నేత డీఎల్ రవీంద్రారెడ్డికి అక్కడి టిక్కెట్ ఇవ్వడానికి పార్టీ సానుకూలంగా ఉన్నట్లు సమాచారం . ప్రస్తుతం రఘురామిరెడ్డి అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు.

ఈ సారి తెలుగుదేశం పార్టీ టీటీడీ చైర్మన్ గా ఉన్న సుధాకర్ యాదవ్ ను మైదుకూరు నుంచి పోటీ చేయించే అవకాశం ఉన్నట్లు సమాచారం రావడం తో ఆయనపై డీఎల్ ను బరిలో దించాలని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నట్లు వైసీపీ కీలక నేత ఒకరు చెప్పారు .సుధాకర్ యాదవ్ ను ఎన్నికల్లో ఆర్థికంగా డీకొట్టాలంటే డీఎల్ అయితేనే బెటరని పార్టీ భావిస్తున్నట్లు సమాచారం.

డీఎల్ కు టిక్కిటిస్తే రఘురామిరెడ్డికి ఎమ్మెల్సీ ఇవ్వడానికి జగన్ సుముఖంగా ఉన్నారని తెలుస్తుంది. డీఎల్ టీడీపీ లో చేరబోతున్నట్టు గత కొన్ని రోజులముందు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ అయింది. కానీ ఈ విషయం బయటకి రావటడం తో టీడీపీ నేతలు కంగుతిన్నారని తెలుస్తుంది .