ఇన్స్ స్టా గ్రామ్ లో కోహ్లీకి ఒక్కో పోస్టుకు ఎంత వస్తుందో తెలుసా

Do you know how much Kohli gets for each post on Instagram

0
101

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ కు ఎంత ఆదరణ ఉందో తెలిసిందే. ప్రపంచంలో అత్యంత ఆదరణ కలిగిన క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒకరు. ఆయన సంపాదన వందల కోట్లలో ఉంటుంది. ఇటు మ్యాచులతో పాటు ఎండార్స్ మెంట్లు, యాడ్స్ ద్వారా కోహ్లీ బాగానే సంపాదిస్తున్నారు. వీటితో పాటు సోషల్ మీడియా ద్వారా కోహ్లీ భారీగా సంపాదిస్తున్నారట.

ఇన్స్ స్టా గ్రామ్ లో ఒక్కో పోస్టుకు కోహ్లీ రూ. 5 కోట్లు వసూలు చేస్తున్నారట. ఈ విషయాన్ని హాపర్ హెచ్ క్యూ సంస్థ వెల్లడించింది.
సో ఆయనకు ఉన్న క్రేజ్ అలాంటిది. ఇండియాలో ఇన్స్ స్టా గ్రామ్ లోలో కోహ్లీకే అత్యధికంగా ఫాలోయర్లు ఉన్నారు. ఇన్ స్టా ద్వారా ఎక్కువగా డబ్బు సంపాదిస్తున్న వారిలో కోహ్లీ 19వ స్థానంలో ఉన్నాడు.

అంతేకాదు టాప్ 20లో ఉన్న ఏకైక ఇండియన్ సెలబ్రిటీ కోహ్లీనే .27వ స్థానంలో బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఒక్కో పోస్టుకు రూ. 3 కోట్లు వసూలు చేస్తోందట. పోర్చుగల్ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో తొలి స్థానంలో ఉన్నాడు. ఒక్కో పోస్టుకు రొనాల్డో రూ. 11 కోట్లు తీసుకుంటాడు.