టోక్యో ఒలింపిక్స్ క్రీడల్లో జావెలిన్ త్రోలో భారత్ కు చెందిన అథ్లెట్ నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు. 87.58 మీటర్ల దూరం విసిరి బెస్ట్ అనిపించుకున్నాడు. ఇప్పుడు ఎక్కడ విన్నా దేశంలో నీరజ్ పేరు వినిపిస్తోంది. అతని గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం.
1.హర్యానాలోని పానిపట్ జిల్లా, ఖాంద్రా గ్రామంలో అతను జన్మించాడు.
2. నీరజ్ తండ్రి రైతు వారి కుటుంబం వ్యవసాయ కుటుంబం
3.చిన్నతనం నుంచి ఎక్కువ బరువుతో ఉండేవాడు నీరజ్, అందుకే రోజూ ఎక్కువ సేపు నడక నడిచేవాడు.
4. చిన్నప్పుడు నీరజ్ కు క్రికెట్ అంటే ఇష్టం ఉండేది
5.11 ఏళ్ల వయసు లో జావెలిన్ మీద ఆసక్తి ఏర్పడింది.
6. ఒకరోజు పానిపట్ స్టేడియంలో జైవీర్ అనే అథ్లెట్ జావెలిన్ ప్రాక్టీస్ చేస్తుంటే
నీరజ్ కూడా నేర్చుకుంటా అన్నాడు అక్కడ నుంచి అతని లైఫ్ టర్న్ అయింది.
7. అలాజలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ హాస్టల్లో ఉండి
అక్కడ కొన్ని నెలలు ట్రైనింగ్ తీసుకున్నాడు.
8. నీరజ్ కు ఇద్దరు చెల్లెల్లు ఉన్నారు.
9. ప్రస్తుతం ఇండియన్ ఆర్మీలో ఉద్యోగం చేస్తున్నాడు.
10.. 2018 ఏషియన్ గేమ్స్, 2018 కామన్ వెల్త్ గేమ్స్ లో 88.6 మీటర్ల త్రో చేసి గోల్డ్ మెడల్ సాధించాడు.