భారత క్రికెట్ టీమ్ సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ అగ్ర కథానాయిక అనుష్క శర్మ లు తల్లిదండ్రులు అయిన విషయం తెలిసిందే, ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.. ఈ సమయంలో బాలీవుడ్ నుంచి అందరూ అలాగే దేశంలో వారి అభిమానులు అందరూ సోషల్ మీడియా ద్వారా విషెస్ అందచేశారు.. ఇటీవల వారు ఆస్పత్రి నుంచి ఇంటికి చేరుకున్నారు.
ఇక ఈ ఏడాది జనవరి 11 న అనుష్క పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ వీరుష్క జంట తమ కూతురుకి వామికగా నామకరణం చేశారు.. బారసాల వేడుకలోని ఫోటోతో వీరుష్క తమ కూతురి మొదటి ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఇక అతి కొద్ది మంది బంధువులు స్నేహితుల సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
ఇక ఈ ఫోటో సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వీరికి ముగ్గరికి విషెస్ అందచేస్తున్నారు, ఇక విరుష్క జోడికి బాలీవుడ్ లో సెలబ్రెటీలు సైతం సోషల్ మీడియాలో విషెస్ తెలియచేస్తున్నారు.
Attachments area