రూమార్స్ పై క్లారిటీ ఇచ్చిన డివివి దానయ్య

రూమార్స్ పై క్లారిటీ ఇచ్చిన డివివి దానయ్య

0
62

భరత్ అనే నేను వంటి బ్లాక్ బస్టర్ చిత్రాన్ని నిర్మించిన నిర్మాత డివివి దానయ్య పై పలు రకాల కథనాలు మీడియాలో రావడంతో అవన్నీ వాస్తవం కాదని నేను ఎవరికీ డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టలేదని అందరికి కూడా రెమ్యునరేషన్ ఇచ్చానని అంటున్నాడు . కొరటాల శివ దర్శకత్వంలో డివివి దానయ్య నిర్మించిన చిత్రం ” భరత్ అనే నేను ” . వేసవిలో విడుదలైన ఈ చిత్రం మహేష్ కెరీర్ లోనే కాకుండా అటు కొరటాల ఇటు డివివి దానయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది భారీ వసూళ్ల ని సాధించింది .

అయితే దర్శకులు కొరటాల శివ కు అలాగే హీరోయిన్ కైరా అద్వానీ తో పాటుగా కొంతమంది కి డివివి దానయ్య పూర్తిస్థాయిలో రెమ్యునరేషన్ ఇవ్వలేదని , లాభాలు వచ్చినప్పటికీ అవి నొక్కేసి వాళ్లకు డబ్బులు ఎగ్గొట్టాడని కథనాలు వచ్చాయి . దాంతో ఆ కథనాలపై ఆగ్రహంగా ఉన్నాడు దానయ్య . ఎవరికైనా కావాలంటే వచ్చి లెక్కలు చూసుకోవచ్చు అంతేకాని అనవసరమైన కథనాలు రాయకండి అంటూ ఆరోపణలను ఖండిస్తున్నాడు .

భరత్ అనే నేను చిత్రం తర్వాత ఎన్టీఆర్ – చరణ్ లతో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రాజమౌళి దర్శకత్వంలో నిర్మించనున్నాడు డివివి దానయ్య .