వైఎస్‌ జగన్‌ అంతే కంటే పట్టుదల కలిగిన వ్యక్తి

వైఎస్‌ జగన్‌ అంతే కంటే పట్టుదల కలిగిన వ్యక్తి

0
139

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి తలపెట్టిన ‘ప్రజా సంకల్ప యాత్ర’ తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా సాగుతోంది. బుధవారం నాడు కాకినాడలోకి జగన్ అడుగుపెట్టారు. ఈ సందర్భంగా వైసీపీ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. కాకినాడలోని సంత చెరువు ప్రాంతంలో జగన్ కోసం పార్టీ శ్రేణులు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశాయి.

ఈ సందర్భంగా కాకినాడ సిటీ కోర్డీనేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.”ముందుగా.. మనందరి కోసం కాకినాడ వచ్చిన వైయస్‌ జగన్‌కు కృతజ్ఞతలు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి మాదిరిగా వైఎస్‌ జగన్‌ కూడా పట్టుదల ఉన్న వ్యక్తి. ముఖ్యమంత్రి చంద్రబాబు అమలుకు సాధ్యం కాని హామీలు ఇచ్చి మోసం చేశారు. చంద్రబాబు ద్రోహానికి గురికాని వారు ఒక్కరూ ఉండరు. బాబు మోసాలతో నష్టపోయిన వారికి ధైర్యం చెప్పేందుకు వైఎస్‌ జగన్‌ పాదయాత్రగా వచ్చారు. మన వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఎంత పట్టుదల ఉన్న వ్యక్తో.. వైఎస్‌ జగన్‌ అంతే కంటే పట్టుదల కలిగిన వ్యక్తి అని చెప్పారు. అందరం కలిసి జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకుందాము” అని చంద్రశేఖర్ రెడ్డి పిలుపునిచ్చారు.