రాజమౌళి #RRR కథ ఏమిటో తెలుసా ?

రాజమౌళి #RRR కథ ఏమిటో తెలుసా ?

0
49

బాహుబలి సినిమా తరువాత రాజమౌళి చేసే సినిమా పై కేవలం టాలీవుడ్ మాత్రమే కాక మొత్తం యావత్ భారతదేశం ఎదురుచూస్తుంది. దీనిపై కొంచెం క్లారిటీ ఇస్తూ రాజమౌళి తన సినిమా మల్టీ స్టారర్ అని చెప్పాడు. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోస్ అయిన ఎన్టీఆర్ , రాంచరణ్ కలిసి నటించనున్నారు. ఈ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసిన రోజునుండి అందరిలోనూ ఆసక్తి మొదలయ్యింది.

ఇక అప్పటి నుండి ఈ సినిమా కథ మీద రోజుకో వార్త బయటకువస్తుంది. మొన్నటివరకు ఈ సినిమాలో ఇద్దరు హీరోలు బాక్సర్లు గా కనిపిస్తారని బాగా ప్రచారమైంది. దీనిపై స్వయంగా రాంచరణ్ క్లారిటీ ఇచ్చాడు. తరువాత అది రూమర్ అని తేలిపోయింది. ఇప్పుడు మరో వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది.

అది ఏమిటంటే.రాజమౌళి మల్టీ స్టారర్ మూవీ స్వసంత్ర ఉద్యమ నేపథ్యం లో తియనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమాలో ఆనాటికాలాన్ని ప్రతిబింబించేలా భారీ సెట్టింగ్ లు, అప్పుడు వున్నా కార్లు తయారు చేయిస్తున్నాడు అని సమాచారం. ఈ సినిమాకోసం ఇప్పటికే భారీ సెట్టింగ్లు రెడీ చేస్తున్నారు. వచ్చే నవంబర్ నుండి ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుంది. చూడాలి మరి ఈ కథైనా నిజమేనా లేక రూమరేనా అని .