బిగ్ బాస్ షో కి రావడం తనకి ఇష్టం లేదంట ఎందుకంటే ?

బిగ్ బాస్ షో కి రావడం తనకి ఇష్టం లేదంట ఎందుకంటే ?

0
51

బిగ్‌బాస్ రెండో సీజన్‌ రసవత్తరంగా సాగుతోంది. అయితే ఇందులో మరింత మసాలాను పెంచేందుకు హీరోయిన్ హెబా పటేల్‌ను హౌస్‌లోకి తేనున్నారని ఇటీవల వార్తలు వచ్చాయి. వైల్డ్‌కార్డ్ ఎంట్రీ ద్వారా త్వరలో ఆమె బిగ్‌బాస్ హౌస్‌లోకి రాబోతున్నట్లు గుసగుసలు వినిపించాయి. ఇవి కాస్త ఆ అమ్మడి చెవిన పడటంతో ఆ వార్తలపై స్పందించింది హెబా.

ప్రస్తుతం తన చేతిలో ఉన్న ప్రాజెక్ట్‌లతో తాను బిజీగా ఉన్నానని హెబా తెలిపింది. అంతేకాకుండా ఎలాంటి టీవీ షోలలో పాల్గొనేందుకు తనకు ఆసక్తి లేదని, ఇలాంటి వార్తలు తనను కాస్త బాధపెట్టాయని ఆమె పేర్కొంది. కాగా ప్రస్తుతం హెబా పటేల్ 24 కిస్సెస్ అనే చిత్రంలో నటిస్తోంది. వచ్చే నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.