హాట్ న్యూస్ : ఈటలకు మావోయిస్టు లేఖపై డౌటనుమానాలు

maoist jagan open letter maoist letter maoist letter to etala rajendar maoist spokesperson jagan letter

0
137

మావోయిస్టులు అనగానే దోపిడీదారులకు వెన్నుల్లో వణుకు పుడుతుంది. మావోయిస్టులు అనగానే అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడతాయి. మావోయిస్టుల లక్ష్యం సాయుధ పంథాలో విప్లవం సాధించడం. తాజాగా మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి జగన్ పేరుతో విడుదలైన ఒక లేఖ తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారాన్నే రేపుతున్నది. ఆ లేఖపై అనేక అనుమానాలు కలుగుతున్నాయి. లేఖను చదివి కింద వివరణ చదవండి.

ఈటల రాజేందర్ తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ ఇచ్చిన ప్రకటనను మావోయిస్టు పార్టీ ఖండిస్తూ లేఖ జారీ చేసింది. మావోయిస్టు పార్టీని దగ్గరగా చూసిన (కవరేజీ చేసిన) జర్నలిస్టులు, మావోయిస్టు పార్టీ లేఖల పట్ల అవగాహన ఉన్న జర్నలిస్టులు సైతం ఈ లేఖను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి లేఖను ఎప్పుడూ రాయంగ చూడలేదని సీనియర్ జర్నలిస్టులు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్ట్) అధికార ప్రతినిధి జగన్ పేరుతో లేఖ రిలీజ్ అయింది. కానీ ఎన్నడూ లేనిది ఆ లేఖ మీద జగన్ సంతకాన్ని స్కాన్ చేసి మరీ ముద్రించారు. మావోయిస్టు లేఖలు తొలుత మీడియా వారికే చేరతాయి. ‘‘నా సుదీర్ఘ జర్నలిస్టు జీవితంలో మావోయిస్టులు విడుదల చేసిన లేఖలను ఎన్నో చూశాను… కానీ ఈ లేఖలో జగన్ పేరుతో సంతకాన్ని స్కాన్ చేసి ప్రచురించడం నాకు ఆశ్చర్యం కలిగించింది. మావోయిస్టులు రాసే లేఖలు కచ్చితంగా ఎరుపు రంగులోనే ఉంటాయి. ఈ లెటర్ రెడ్ కలర్ లోనే ఉంది కానీ సంతకం స్కాన్ చేసిన తీరును చూస్తే ఇది నిజమైన మావోయిస్టులు రాసిందేనా అని నాకైతే అనుమానంగా ఉంది’’ అని ఒక సీనియర్ జర్నలిస్ట్ కామెంట్ చేశారు. ఇక లేఖలో వాడిన పాంట్స్ పట్ల కూడా ఆయన అనుమానాలు వ్యక్తం చేశారు.

ఈటల రాజేందర్ అనే వ్యక్తి మావోయిస్టులకు గల్లీ లీడర్ లెక్కనే. ఈటల రాజేందర్ బిజెపిలోకి పోయినా, కాంగ్రెస్ లోకి పోయినా మావోయిస్టులకు లేఖ రాయాల్సినంత అవసరముందా అన్నది అనుమానాస్పదంగా ఉంది. ఈటల రాజేందర్ వ్యక్తిగత విషయాలను టార్గెట్ చేస్తూ లేఖ రిలీజ్ చేస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. లేఖలో టైటిల్ చూస్తేనే చిత్ర విచిత్రంగా ఉందని దశాబ్దకాలంగా జర్నలిజంలో పనిచేస్తున్న కొందరు జర్నలిస్టులు వ్యాఖ్యానించారు.

ఇక ఈ లేఖలో ఈటల రాజేందర్ ను తలుపు చెక్కతో కొడితే… కేసిఆర్ ను తమలపాకుతో కొట్టే ప్రయత్నం చేశారనిపిస్తున్నది. ఈటల ఆత్మగౌరవ పోరాటాన్ని చేపడతానని చెప్పి బిజెపిలో చేరడాన్ని మావోయిస్టు పార్టీ తప్పు పడుతున్నదని లేఖలో రాశారు. ఇది విచిత్రంగా ఉంది. ఈటల ఆత్మగౌరవ పోరాటం చేస్తే మావోయిస్టులకు ఎందుకు? ఆత్మాభిమాన పోరాటం చేస్తే ఎందుకు? అనేది అంతుచిక్కడం లేదు. ఇంకో విషయం ఏమంటే… ఈటలను బిజెపిలో చేరవద్దని పలుమార్లు మావోయిస్టులు హెచ్చరించారట… వారి హెచ్చరికను కాదని నిస్సిగ్గుగా ఈటల బిజెపిలో చేరిండట… ఇది కూడా చిత్రమైన స్టేట్ మెంట్ కింద ఉంది. ఈటల రాజేందర్ ఒక మామూలు నాయకుడు. ఆయన ఏ పార్టీలోకి పోతే మావోయిస్టులకు ఏం అవసరం అనేది తెలియడంలేదు.

లేఖ మొత్తం చదివితే ఇదేదో ఈటలకు వ్యతిరేకులు, టిఆర్ఎస్ కు అనుకూలంగా ఉండేవారు రాశారేమోనన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే లేఖలో అక్కడక్కడా టిఆర్ఎస్ ను తమలపాకుతో కొట్టినట్లు చేస్తూ బ్యాలెన్స్ చేసే ప్రయత్నం చేశారనిపిస్తున్నది. ఈ లేఖపై సరైన విచారణ జరిపితే వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

నోట్ : గతంలో మావోయిస్టులు విడుదల చేసిన కొన్ని లేఖలను కింద ప్రచురిస్తున్నాము… చూడొచ్చు. అలాగే తాజాగా ఈటల రాజేందర్ టార్గెట్ గా మావోయిస్టుల పేరుతో విడుదలైన లేఖను ఆర్టికల్ స్టార్టింగ్ లోనే ప్రచురించడం జరిగింది. స్కాన్డ్ సిగ్నేచర్ మాత్రం ఎక్కడా ఉపయోగించిన పరిస్థితి కనబడలేదు. జగన్ పేరుతో విడుదలైన లేఖల్లో అసలు ఆయన సంతకాలే లేవు. కానీ ఇఖ్కడ స్కాన్డ్ సిగ్నేచర్ ఉండడంతో అనుమానాలకు బలం చేకూరుతోంది.