బుమ్రాపై అభిమానులు ట్రోల్స్- ఫోటోలు కాదు వికెట్లు తీయ్

Fans troll on Bumrah

0
121

టీమిండియా WTC ఫైనల్లో న్యూజిలాండ్ టీమిండియా చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. టీమిండియా ఆటపై ఎన్నో ట్రోల్స్ కామెంట్స్ వచ్చాయి. ఈ మ్యాచ్లో టీమిండియా బౌలర్లు పెద్దగా రాణించింది కూడా లేదు. ఇషాంత్ శర్మ, మహ్మద్ షమీ రెండు ఇన్నింగ్స్లలో కలిపి చెరో ఏడు వికెట్లు తీశారు, కానీ ఎన్నో ఆశలు పెట్టుకున్న బూమ్రా మాత్రం ఎలాంటి వికెట్ తీయలేదు.

బుమ్రా వైఫల్యం కోహ్లీసేన కొంప ముంచింది. దీంతో టీమిండియా పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుమ్రా సతీమణి సంజనా గణేశన్తో దిగిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు బూమ్రా.
మ్యాచ్ లో ఓటమి పాలవడంతో కోపంతో ఉన్న అభిమానులు ఈ ఫోటో పై ట్రోల్స్, మీమ్స్తో రెచ్చిపోయారు.

పెళ్లైన నాటి నుంచి ఫోటోల మీద ఎక్కువ దృష్టి పెడుతున్నావు. నీలో గతంలో ఉన్న జోష్ లేదు. బుమ్రా ఫోటోలు కాదు ముందు వికెట్లు తీయ్ అని కామెంట్లు చేస్తున్నారు. అయితే దీనిపై కొందరు మాత్రం ఆటని ఆటగా చూడాలి, ఇలా తన ఫోటోపై నెగిటీవ్ కామెంట్లు పెట్టడం మంచిది కాదని తెలియచేస్తున్నారు