షాపింగ్ మాల్ లో చెలరేగిన మంటలు..రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది

0
120
Kabul

ఒడిశా రాజధాని అయినా భువనేశ్వర్​లోని ఓ షాపింగ్​ మాల్​లో శుక్రవారం రాత్రి షార్ట్​ సర్క్యూట్​ కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మార్కెట్​ బిల్డింగ్​ సమీపంలోని బీఎంసీ కేశరి మాల్​లో ఉన్న వస్త్ర దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన జరిగిన సమయంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు కానీ..లక్షలు విలువచేసే వస్త్రాలు మంటలో కాలి బూడిదయినట్లు స్థానికులు చెబుతున్నారు. సమాచారం తెలిసిన వెంటనే ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అర్పడానికి ఎంతగానో ప్రయత్నించారు. కానీ అంతలోనే వస్త్రలన్ని దగ్ధం కావడంతో షాప్ ఓనర్ కన్నీటి పర్యంతమయ్యాడు.