ముగిసిన తొలి ఇన్నింగ్స్..భారత్ స్కోర్ ఎంతంటే?

First innings ended .. What is the score of India?

0
84

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్‌లో రెండో రోజు భారత బ్యాట్స్‌మెన్లు త్వరగానే వికెట్లను సమర్పించుకున్నారు. దీంతో టీమిండియా తన తొలి ఇన్నింగ్స్‌లో 345 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో న్యూజిలాండ్ ముందు భారీ స్కోర్‌ను ఉంచింది.

తొలి రోజు భారత్ బ్యాట్స్‌మెన్ రాణించడంతో ఆట ముగిసే సమయానికి నాలుగు వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసిన సంగతి తెలిసిందే. ఇదే స్కోర్‌తో రెండో రోజు ఆటను జడేజా, శ్రేయాస్ అయ్యర్‌లు ప్రారంభించారు. అయితే జడేజా (50 పరుగులు, 112 బంతులు, 6 ఫోర్లు) రెండో రోజు పరుగులేమీ చేయకుండానే సౌతీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. దీంతో జడేజా, శ్రేయాస్ అయ్యర్‌లు ఇద్దరూ కలిసి 121 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని అందించారు. ఆ తరువాత సాహా(1) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేక సౌతీకి వికెట్ సమర్పించుకున్నాడు.

తన తొలి సెంచరీ చేసి దూకుడు మీదున్న శ్రేయస్ అయ్యర్ (105 పరుగులు, 171 బంతులు, 13 ఫోర్లు, 2 సిక్సులు) కూడా డ్రింక్స్‌ తరువాత తొలి బంతికే సౌతీకి చిక్కాడు. ఆ తరువాత అక్షర్(3) కూడా వెంటనే పెవిలియన్ చేరాడు. ఉమేష్ యాదవ్ 10 నాటౌట్, అశ్విన్ 38, ఇషాంత్ శర్మ 0 పరుగులు చేశారు.న్యూజిలాండ్ బౌలర్లలో సౌతీ 5, కైల్ జైమీసన్ 3, అజాజ్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు.

న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్​లో భాగంగా టీమ్​ఇండియా జట్టులో అవకాశం దక్కించుకున్నాడు యువ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్. తొలి టెస్టులోనే శతకం నమోదు చేసిన 16వ భారత ఆటగాడిగా నిలిచాడు. 157 బంతుల్లో 100 పరుగులు చేశాడు.