Flash News : తెలంగాణ ప్రజలకు షర్మిల పార్టీ ఇస్తున్న ఆఫర్ ఇదే

Ys Sharmila New Party Updates

0
98

తెలంగాణలో సొంత పార్టీ నెలకొల్పే దిశగా వైఎస్ షర్మిల ముందుకు సాగుతన్నారు. వచ్చే నెలలో ఆమె ఏర్పాటు చేయబోయే పార్టీ వెలుగులోకి రానుంది. దీనికోసం సన్నాహక సమావేశం హైదరాబాద్ లోని లోటస్ పాండ్ లో జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణలోని అన్ని జిల్లాల నుంచి ముఖ్యమైన వ్యక్తులు హాజరయ్యారు. సమావేశంలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఆమె ఏమన్నారో ఆమె మాటల్లో…

తెలంగాణ‌లో రాజ‌న్న సంక్షేమ పాల‌నకు పున‌ర్జీవం పోసేందుకు నేను సిద్ధ‌ప‌డ్డాను. కుటుంబ పాల‌న‌తో ద‌గా ప‌డుతున్న తెలంగాణ ప్ర‌జ‌ల ప‌క్షాన పోరుకు తెగించాను. ఆ దిశ‌గా నా రాజ‌కీయ ప్ర‌స్థానాన్ని మొద‌లుపెట్టాను. స‌క‌ల జ‌నుల సంక్షేమ‌మే ధ్యేయంగా నా ప‌య‌నం సాగిస్తా.. ఇందుకు మీ స‌హాయ‌, స‌హ‌కారాలు కోరుతున్నా.. మీ రాజ‌న్న బిడ్డ‌గా మీ ఆశీస్సులు అడుగుతున్నా..

జూలై 8న మ‌హానేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి జ‌యంతి రోజును పార్టీ ఆవిర్భావించాల‌ని నిర్ణ‌యించాం. అన్ని వ‌ర్గాల‌ బాగు కోసం మ‌నం స్థాపించ‌బోయే పార్టీకి సంబంధించి జెండా, అజెండా రూప‌క‌ల్ప‌న‌లో భాగంగా రాష్ట్రంలోని ప్ర‌జ‌లంద‌రి నుంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు స్వీక‌రించాల‌ని భావించాను. ఇందుకోసం ఒక ఈమెయిల్ ఐడీ, వాట్సాప్ నంబ‌ర్‌ను క్రియేట్ చేశాం. రాష్ట్రంలోని పేద‌లు, యువ‌త‌, విద్యావంతులు, మేధావులు, లాయ‌ర్లు, పారిశ్రామిక వేత్త‌లు, అనుభ‌వ‌జ్ఞులు, రాజ‌కీయ విశ్లేష‌కులు వారి వారి అమూల్య‌మైన స‌ల‌హాలు అందించాల‌ని భావిస్తున్నాను.

కార్యకర్తలు అంటే ఖద్దరు చొక్కా కాదు.. కార్యకర్తలు అంటే జనం గుండె చప్పుడు విని ఎజెండా లు రాసే వాళ్ళు. కార్యకర్తలు అంటే అనుసంధానం కర్తలు. కేవలం తెలంగాణ సంక్షేమ కోసమే పార్టీ పెట్టబోతున్నాం.
మన పార్టీ లో కార్యకర్తలు కీలకం. వారికే పెద్ద పీట వేస్తాము. కార్యకర్తలు ఏది చెబితే అదే మన రాజ్యాంగం.
పార్టీ తెలంగాణ లో అభివృద్ధి కోసం ఏర్పాటు చేస్తున్నాము. ఈ నెల రోజుల్లో ప్రతి గడపకు వెళ్లి ప్రజల ఆలోచనలు, ఆశయాలు ఏంటో పూర్తి గా అవగాహన తెలుసుకోవాలి.
ప్రతి కుల సంఘాన్ని, మేధావులను కదిలించి మన సిద్ధాంతాలు రూపొందించుకోవాలి. మన పార్టీ ప్రజల పార్టీ. మన పార్టీ ఎజెండా ని ప్రతి తెలంగాణ బిడ్డ రాయాలి.
ప్రతి ఒక్కరి అభిప్రాయాలను మెయిల్ id మరియు వాట్సాప్ కి పంపాలి. పంపాల్సిన మెయిల్ ఐడి : Reach@realyssharmila@gmail.com
వాట్సాప్ నెంబర్ : 8374167039.