నిజంగా దారుణమైన ఘటన ఇది, అతి చిన్న వయసులోనే అతని జీవితం ముగిసిపోయింది, మంచి క్రీడాకారుడ్ని తాము కోల్పోయాము అని ఆ దేశంలో అందరూ కన్నీరు పెట్టుకుంటున్నారు.అప్ఘానిస్థాన్ క్రికెట్లో విషాద ఘటన జరిగింది.
గత వారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన అప్ఘాన్ బ్యాట్స్మెన్ నజీబ్ తర్కారీ తుది శ్వాస విడిచాడు. జలాలాబాద్లోని ఈస్ట్రన్ నంగ్రహార్లో రోడ్డు దాటుతున్న సమయంలో తర్కారీని ఓ కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన అతడు కోమాలోకి వెళ్లాడు. చివరకు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు.
ఈ విషయాన్ని అప్ఘానిస్థాన్ క్రికెట్ బోర్డు తెలిపింది. అతను అప్ఘాన్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్. నజీబ్ తర్కారీ వయసు 29 ఏళ్లు , ఆయన మరణంతో అప్ఘాన్ క్రికెట్ బోర్డు సంతాపం వ్యక్తం చేసింది. నజీబ్ 2014లో ఆసియాలో కప్ లో బంగ్లాదేశ్ తో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. అప్ఘాన్ తరఫున 13 అంతర్జాతీయ టీ20 మ్యాచ్ లు ఆడిన తర్కారీ.. గ్రేటర్ నోయిడాలో ఐర్లాండ్ తో జరిగిన మ్యాచ్ లో 90 పరుగులు చేశాడు. ఆయనకు దేశం అంతా సంతాపం తెలిపింది.