కేంద్ర ఎన్నికల కమిషనర్‌గా మాజీ ఐఏఎస్ అధికారి అనూప్ చంద్ర పాండేను కేంద్రం నియమించింది. అనూప్ పాండే.. 1984 ఉత్తర్ ప్రదేశ్ క్యాడర్ అధికారి. ఎన్నికల కమిషనర్‌గా సునీల్ అరోరా పదవీకాలం ఏప్రిల్ 12న పూర్తి కావటం వల్ల పోల్ ప్యానెల్లో ఖాళీ ఏర్పడింది.
ప్రస్తుతం సునీల్ అరోరా ఎన్నికల ప్రధాన అధికారిగా ఉన్నారు. రాజీవ్‌కుమార్ ఎన్నికల కమిషనర్‌గా కొనసాగుతున్నారు.