ఆస్ట్రేలియా స్టార్ బ్యాటర్ గ్లెన్ మ్యాక్స్‌వెల్. బిగ్‌బాష్ లీగ్‌లో అదరగొట్టాడు. హాబర్ట్ హరికేన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మెల్బోర్న్ స్టార్స్ కెప్టెన్ మ్యాక్స్‌వెల్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 41 బంతుల్లోనే సెంచరీ సాధించాడు.
బౌండరీలు బాదుతూ హరికేన్స్ బౌలర్లను ఊచకోత కోశాడు. 64 బంతుల్లో 154 పరుగులు చేశాడు. అతడి ఇన్నింగ్స్‌లో 24 ఫోర్లు, నాలుగు సిక్స్‌లు బాదాడు. ఈ లీగ్ చరిత్రలోనే వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.
మరోవైపు మ్యాక్స్‌వెల్‌కు తోడు స్టోయినిస్ చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో మెల్బోర్న్ రెండు వికెట్ల నష్టానికి 273 పరుగుల భారీ లక్ష్యాన్ని సాధించింది. ఇప్పటివరకు బిగ్‌బాష్‌లీగ్‌లో ఇదే అత్యధిక స్కోరు. హరికేన్స్ బౌలర్లు జోష్ఖాన్, థామ్సన్ చేరో వికెట్ పడగొట్టారు.