టీమ్​ఇండియా ఆల్​రౌండర్​​ హార్దిక్​ పాండ్యకు గోల్డెన్ ఛాన్స్​

Golden Chance for Team India all-rounder Hardik Pandya

0
95

టీమ్​ఇండియా ఆల్​రౌండర్​​ హార్దిక్​ పాండ్యకు గోల్డెన్ ఛాన్స్​ దక్కనుంది. ఐపీఎల్​లో కొత్త ఫ్రాంఛైజీ అహ్మదాబాద్​ జట్టుకు కెప్టెన్​గా​ టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్ పాండ్య వ్యవహరించనున్నాడని సమాచారం. ఐపీఎల్​లోని విశ్వసనీయ వర్గాలు ఈ మేరకు వెల్లడించాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరోవైపు ఐపీఎల్​ 2022 మెగా వేలం బెంగళూరులో ఫిబ్రవరి రెండో వారంలో జరగనుంది. అది ఫిబ్రవరి 11-13 మధ్య జరగవచ్చని తెలుస్తోంది. మెగా వేలం నేపథ్యంలో గతేడాది నవంబర్​లో ప్రస్తుత ఐపీఎల్​ ఫ్రాంఛైజీలన్నీ..తాము రీటెయిన్ చేసుకున్న ప్లేయర్ల జాబితా విడుదల చేశాయి. అందులో భాగంగా హార్దిక్​ను వదిలేసుకుంది ముంబయి ఇండియన్స్​.

కాగా కొద్దికాలంగా హార్దిక్ ఫామ్ లేమితో సతమతమవుతున్నాడు. బ్యాటింగ్ చేస్తున్న బౌలింగ్ చేయలేకపోవడం మైనస్ గా మారింది. దీనితో హార్దిక్ ను పక్కనబెట్టిన సంగతి తెలిసిందే. దాంతో అతని స్థానంలో శార్దూల్ సేవలను వాడుకుంది.