ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ లో స్వర్ణం గెలిచిన తొలి భారత మహిళగా చరిత్ర సృష్టించిన స్ప్రింటర్ హిమ దాస్‌ను భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధా ని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. ఫిన్‌లాండ్‌లోని తాంపెరెలో గురువారం జరిగిన అండర్ 20 అథ్లెటిక్స్ వరల్డ్ చాంపియన్‌షిప్ 400 మీటర్ల ఈవెంట్‌లో హిమదాస్ స్వర్ణ పతకం సాధించిన సంగతి తెలిసిందే. ‘ కంగ్రాచ్యులేషన్ స్ప్రింటర్ హిమదాస్. వరల్డ్ అండర్-20 చాంపియున్‌షిప్‌లో బంగారు పతకం సాధించిన మొదటి మహిళగా రికార్డు సృష్టించావు. అస్సాం, భారత్‌కు నువ్వు గర్వకారణం. ఒలింపిక్‌లో పతకం సాధించే దిశగా నువ్వు కృషి చేయాలి’ అని రాష్ట్రపతి ట్వీటర్‌లో పేర్కొన్నారు. ‘దేశం నిన్ను చూసి గర్విస్తోంది. నీకు అభినందనలు. నీవు సాధించిన ఈ విజయం యువ అథ్లెట్లకు స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ‘ హివుదాస్ చరిత్ర సృష్టించింది. వరల్డ్ అండర్-20 చాంపియన్‌షిప్‌లో పసిడి పతకం సాధించిన తొలి మహిళ. భారత్ గర్వపడేలా చే శావు నారిశక్తి’ అని కేంద్ర క్రీడాశాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోర్ ట్వీటర్‌లో తెలిపారు. దీంతో హిమదాస్ నేను నా కలను సాధించాను అని తెలిపింది. ‘ నా కుటుంబ పరిస్థితి నాకు తెలుసు. నేను పాజిటివ్ వ్యక్తిని. నేను నా దేశం, నా తల్లిదండ్రులు కోసం ఏమైనా చేస్తాను. అథ్లెటిక్స్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించడంతో నా కల నేరవేరింది’ అని హిమ భావోద్వేగానికి గురైంది. 18 ఏళ్ల హిమ దాస్ 51.46 సెకన్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది. అథ్లెటిక్స్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు స్వర్ణం రావడం ఇదే తొలిసారి. ఈ ఛాంపియన్‌షిప్‌లో పతకం గెలిచిన తొలి భారత ట్రాక్ అథ్లెట్‌గా హిమదాస్ చరిత్ర స ష్టించింది. ఈ పతకంతో ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా సరసన హిమదాస్ నిలిచింది. అసోంకు చెందిన హిమ దాస్ ఈ ఏడాది మొదట్లో గోల్ట్ కోస్ట్ వేదికగా జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో 51.32 టైమింగ్‌తో ఆరో స్థానంలో నిలిచింది.
గోల్డెన్ గర్ల్ కి రాష్ట్రపతి ప్రశంసలు
గోల్డెన్ గర్ల్ కి రాష్ట్రపతి ప్రశంసలు