ఫ్లాష్ న్యూస్….క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

ఫ్లాష్ న్యూస్....క్రికెట్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

0
114

చైనాలో పుట్టి యావ‌త్ దేశాల‌కు పాకేసింది ఈ వైర‌స్.. దీంతో జ‌నం బ‌య‌ట‌కు రావ‌డానికి లేదు, ఎక్క‌డిక‌క్క‌డ జ‌ర‌గాల్సిన అన్నీ టోర్నీలు మ్యాచులు ప్ర‌స్తుతానికి ఆపేశారు.ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు ప్రతిష్టాత్మక క్రీడా టోర్నమెంట్లు వాయిదా పడ్డాయి. టోక్యో ఒలింపిక్స్, వింబుల్డన్, ఫిఫా టోర్నమెంట్లను వాయిదా వేశారు.

ఇక ఐపీఎల్ అలాగే ప‌లు కీల‌క మ్యాచ్ లు కూడా వాయిదా వేశారు. ఇక కొన్ని నెల‌ల్లో జ‌ర‌గాల్సిన ఆస్ట్రేలియా లోని టీ-20 ప్రపంచకప్‌ కూడా వాయిదా ప‌డుతుంది అని అనుకున్నారు అంద‌రూ.. కానీ, టీ-20 ప్రపంచకప్ షెడ్యూల్‌లో ఎటువంటి మార్పులు లేవు అని తెలిపింది ఐసీసీ.

ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్-నవంబర్లలో ఐసీసీ టీ-20 ప్రపంచకప్ నిర్వహించాలని షెడ్యూల్‌ను అనుకుంది. ఇక క‌మిటీ దీనిపై పూర్తిగా స‌మీక్ష చేస్తోంది క‌రోనా పై ప‌రిస్దితి అబ్జ‌ర్వ్ చేస్తున్నారు.టీ-20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలోని ఏడు స్టేడియంలు వేదికలుగా.. 2020 అక్టోబర్ 18 నుంచి నవంబర్ 20 వరకూ జరుగుతుంది అని తెలిపారు. ఒక‌వేళ ప‌రిస్దితి మారితే ర‌ద్దు లేదా వాయిదా ప‌డుతుంది అంటున్నారు.