ఐపీఎల్ ఫ్యాన్స్​కు గుడ్​ న్యూస్..ఇకపై మరో రెండు..

0
57

ఐపీఎల్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. వచ్చే ఏడాది నుంచి ఐపీఎల్​ను 75 రోజుల పాటు నిర్వహించేలా బీసీసీఐ ప్లాన్ చేస్తుంది. ఐసీసీ భవిష్యత్తు పర్యటనల జాబితాలోనూ చేరుస్తామని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించాడు. కొత్త ఫ్రాంచైజీలను ఏర్పాటు చేయాలనే ఆలోచన లేదని అన్నాడు.

ప్రస్తుతం ఉన్న ప్రకారం పది జట్లతోనే నిర్వహిస్తామన్నాడు. భారత టీ20 లీగ్ కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించాలని ఐసీసీతోపాటు ఇతర దేశాల క్రికెట్‌ బోర్డులతో చర్చలు జరుపుతున్నాం. వచ్చే ఏడాది టీ20 లీగ్‌ను రెండున్నర నెలలపాటు నిర్వహించేలా ఐసీసీ క్యాలెండర్‌లోనూ అవకాశం కల్పిస్తాం. టాప్‌ ఆటగాళ్లు తప్పకుండా హాజరవుతారు. ఈ లీగ్‌ను విస్తరించే క్రమంలో ఆట నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదు. క్షేత్రస్థాయి నుంచి బలంగా ఉండేలా చర్యలు చేపడుతూనే ఉంటాం. అత్యుత్తమ మౌలిక సదుపాయాలను కల్పిస్తాం” అని జై షా పేర్కొన్నాడు.

కాగా ఇప్పటికే వచ్చే ఐదేళ్లకుగాను మీడియా ప్రసార హక్కులు రూ.48,390 కోట్లకు అమ్ముడుపోయాయి. దీన్ని బట్టి చూస్తే ఐపీఎల్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో అర్దం చేసుకోవచ్చు. అదేవిధంగా ఏటా ఐపీఎల్​లో వివిధ దేశాల ఆటగాళ్లు పాల్గొంటున్నా.. ముందుగా ఉన్న షెడ్యూల్స్​ కారణంగా కొంతమంది ఐపీఎల్​ను మిస్​ అవుతున్నారు. దీంతో తమ అభిమాన ప్లేయర్​ జట్టులో లేడని ఫ్యాన్స్​ కూడా కాస్త నిరాశ చెందుతున్నారు.

ఇప్పుడు ఆ లోటును కూడా బీసీసీఐ భర్తీ చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై కేవలం ఐపీఎల్​ కోసం అన్ని క్రికెట్​ బోర్డులు ప్రత్యేక షెడ్యూల్​ను కేటాయించేలా తీర్మానించింది. దీనికి ఐసీసీ కూడా ఆమోదం తెలపడంతో లైన్​ క్లియరైంది. ఐసీసీ తయారు చేసే తదుపరి క్యాలెండర్​లో ఐపీఎల్​ కోసం రెండున్నర నెలలు కేటాయించనున్నట్లు బీసీసీఐ కార్యదర్శి జైషా ప్రకటించారు.