తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ అభిమానుల‌కి గుడ్ న్యూస్

తండ్రి కాబోతున్న విరాట్ కోహ్లీ అభిమానుల‌కి గుడ్ న్యూస్

0
127

విరాట్ కోహ్లీ అనుష్క జంట చూడ‌చ‌క్క‌ని జంట అనే చెబుతారు ఇండియాలో, ఇటు విరాట్ క్రికెట‌ర్ , ఇటు అనుష్క శ‌ర్మ హీరోయిన్ గా ఉన్నారు, వీరు 2017లో ఇటలీ వేదిక‌గా వివాహం చేసుకున్నారు.
తాజాగా వీరు అభిమానుల‌కి గుడ్ న్యూస్ చెప్పారు… కోహ్లీ త‌న ట్విట్ట‌ర్‌లో భార్యతో కలిసి దిగిన ఫోటోని షేర్ చేస్తూ.. ఇప్పుడు మేం ముగ్గురు కాబోతున్నాం.

2021లో పండంటి బిడ్డ మా ఇంట్లో అడుగుపెట్ట‌నున్నారు అని ట్విట్ట‌ర్ ద్వారా తెలిపాడు. కోహ్లీ షేర్ చేసిన ఫోటోలో అనుష్క బేబి బంప్‌తో క‌నిపిస్తుంది. దీంతో అభిమానులు సెల‌బ్రెటీలు వారికి విషెస్ తెలియ‌చేస్తున్నారు.

అబ్బాయి అయితే క్రికెట‌ర్, అమ్మాయి అయితే సినిమాల‌కు అని స‌రదాగా కామెంట్లుపెడుతున్నారు అభిమానులు.. మొత్తానికి విరాట్ ఇప్పుడు ఐపీఎల్ కోసం యూఏఈ చేరుకొని ఓ హోటల్‌లో స్వీయ నిర్బంధంలో ఉంటూ క‌స‌ర‌త్తులు చేస్తున్నాడు. అనుష్క ప‌లు సినిమాల‌తో బిజీగా ఉంది, ఆమె సినిమానిర్మాణంలో కూడా ఉన్నారు అనే విష‌యం తెలిసిందే…అనుష్క శ‌ర్మ 2008లో వచ్చిన రబ్‌ నే బనా దీ జోడీ చిత్రంతో బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది . బాలీవుడ్‌లో అత్యధిక రెమ్యునరేషన్‌ తీసుకుంటున్న హీరోయిన్లలో అనుష్క శర్మ టాప్‌ ప్లేస్‌లో కొన‌సాగుతున్నారు.