ఫ్లాష్ న్యూస్ — పబ్ జీ లవర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన పబ్ జీ కంపెనీ

ఫ్లాష్ న్యూస్ --- పబ్ జీ లవర్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన పబ్ జీ కంపెనీ

0
88

ఇండియాలో పబ్ జీ బ్యాన్ అయింది, దీంతో అందరూ ఎప్పుడు మళ్లీ పబ్ జీ వస్తుంది, అసలు మళ్లీ ఈ గేమ్ ఆడగలమా అని చూస్తున్నారు, దేశంలో మొత్తం 118 చైనా యాప్స్ని నిషేధంతో వీటి యూజర్లు షాక్ అవుతున్నారు, ముఖ్యంగా బ్యూటీ యాప్స్ చాలా వరకూ క్లోజ్ అయ్యాయి.

అయితే తాజాగా పబ్జీ లవర్స్ కి మాత్రం గుడ్ న్యూస్ చెబుతోంది, .ఈ గేమ్ రూపకర్త సౌత్ కొరియాకు చెందిన గేమింగ్ కంపెనీ పబ్జి కార్పొరేషన్ , ఇండియాలో తాజాగా తీసుకున్న డెసిషన్ తో పబ్జి మొబైల్, పబ్జి మొబైల్ లైట్ గేమ్లకు పబ్లిషింగ్ హక్కులను తామే స్వయంగా పర్యవేక్షిస్తామని, ఇప్పటి వరకూ చూస్తున్న చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్ తో తమకు ఎలాంటి సంబంధం ఉండదని చెప్పేసింది.

దీంతో ఇక ఈ గేమ్ రావడం ఈజీ అంటున్నారు అనలిస్టులు,సౌత్ కొరియాకు చెందిన గేమింగ్ కంపెనీ పబ్జి కార్పొరేషన్ దీనిని రూపొందించిది..మొబైల్ వర్షన్ను ప్రమోట్ చేస్తుంది చైనాకు చెందిన టెన్సెంట్ గేమ్స్, మొత్తానికి తాజా డెసిషన్ తో భారత్ లో దీనికి ఎంట్రీ ఉండచ్చు అంటున్నారు నిపుణులు. తాజాగా భారతీయ చట్టాలు, నిబంధనలను, ప్రభుత్వం చర్యలను పూర్తిగా గౌరవిస్తున్నామనీ, ఈ విషయంలో ఒక పరిష్కారం కోసం భారత ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని భావిస్తున్నామని ప్రకటించింది కంపెనీ.