ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. డిగ్రీ పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం ఉన్నట్టు తెలిపింది. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన న్యూఢిల్లీలోని సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేస్తోంది. అర్హత వున్నవాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోచ్చు.
దీనిలో మొత్తం తొమ్మిది ఖాళీలు వున్నాయి. ఈ నోటిఫికేషన్ ద్వారా మేనేజర్ పోస్టులును సెంట్రల్ మెడికల్ సర్వీసెస్ సొసైటీ భర్తీ చేస్తోంది. ఫైనాన్స్, క్యూలిటీ అస్యూరెన్స్, ఐటీ, ప్రొక్యూర్‌మెంట్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు వున్నాయి. ఇక వయస్సు విషయానికి వస్తే.. అభ్యర్ధుల వయసు 40 ఏళ్లకు మించరాదు.
ఇక శాలరీ విషయానికి వస్తే.. నెలకు రూ.35,000ల వరకు జీతాన్ని చెల్లిస్తారు. ఇక అర్హతల విషయం లోకి వస్తే.. సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్/బీకామ్/బీఫార్మసీ/ఎల్‌ఎల్‌బీ/ఎంఫార్మసీ/ఎంబీఏ/ఎంసీఏ/సీఏ/ఐసీడబ్ల్యూఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఇక ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూస్తే… ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ ఏప్రిల్ 8, 2022. పూర్తి వివరాల కోసం http://cmss.gov.in/ లో చూడండి.
దరఖాస్తు చేయడానికి చిరునామా: జనరల్ మేనేజర్ (అడ్మినిస్ట్రేషన్), సీఎంఎస్ఎస్, 2వ ఫ్లోర్, విశ్వ యువక్ కేంద్ర, టీన్‌మార్తి మార్గ్, చాణక్యపురి, న్యూఢిల్లీ 110021.