రైతులకు సర్కార్ తీపి కబురు..రుణమాఫీపై కీలక ప్రకటన

0
118

తెలంగాణ ప్రభుత్వం వరుస శుభవార్తలతో ప్రజలను ఆనంద పరుస్తున్నారు. ఇప్పటికే రైతులను ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో తెలంగాణ ప్రభుత్వం రైతు బంధు పథకాన్ని అమలు చేసి కొంత మేరకు ఆదుకుంటున్నారు. రైతులకు ప్రతీ ఎకరాకు సంవత్సరానికి రూ.10 వేల చొప్పున పెట్టుబడి సాయం చేస్తూ ఆదుకుంటున్నారు.

అలాగే ఈ వానాకాలం కూడా రూ.5 వేల చొప్పున రైతుబంధు ఇచ్చేందుకు అన్ని సన్నాహాలు చేస్తునట్టు తెలంగాణ సర్కార్ తెలిపి రైతులను అబ్బురపరిచారు. అయితే తాజాగా రుణమాఫీపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసి రైతులకు ఖుషి చేసారు. కరీంనగర్ లో నాలుగవ విడత పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ..త్వరలోనే రైతు రుణమాఫీ చేస్తామని మంత్రి తెలిపారు.

అంతేకాకుండా పరిసరప్రాంతాలు పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలను సీఎం కేసీఆర్ చేపట్టడాన్ని తెలిపాడు. ఎన్నో పోరాటాలతో తెలంగాణను సాధించుకున్న సందర్భంగా తెలంగాణాలో సంపద పెంచి భావితరాలకు పంచాలని తెలిపాడు.