హలో గురు ప్రేమ కోసమే సెట్ లో గొడవ

హలో గురు ప్రేమ కోసమే సెట్ లో గొడవ

0
123

ఎనర్జిటిక్ హీరో రామ్ నటిస్తున్న చిత్రం ‘హలో గురు ప్రేమ కోసమే’. హీరో రామ్ యూత్ ను దృష్టిలో పెట్టుకొని అటు మాస్ ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించే విధంగా కథలను ఎంపిక చేసుకుంటాడు. రామ్ చిత్రాలలో కథ జోరుగా హుషారుగా పరుగులు తీస్తుంది. అదే కోవలోకి ఈ చిత్రం వస్తుందని టైటిల్ ను బట్టి అర్ధమవుతుంది. ఈ సినిమాకు త్రినాథ్ రావు నక్కిన దర్శకత్వం వహిస్తున్నాడు. రామ్ సరసన అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రానికి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రకాష్ రాజ్ ప్రత్యేకమైన పాత్రలో నటించనున్నారు.

తాజాగా ఈ చిత్రం షూటింగ్ మధ్యలోనే ఆగిపోయిందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. డైరెక్టర్ చెప్పాల్సిన పనులను రైటర్ చెబుతుండడంతో ఈ సినిమా సినిమాటోగ్రాఫర్ ఫైర్ అయ్యారని, దీంతో ఆరోజు సినిమా షూటింగును మధ్యలోనే ఆపేశారని తెలుస్తోంది. అయితే ఈ విషయంలో దర్శకుడు త్రినాథరావు నక్కిన కలగజేసుకుని ఇద్దరినీ శాంతిపజేశారని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు చివరి దశలో ఉంది. దసరా కానుకగా ప్రేక్షకులకు ఈ సినిమాను అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు చిత్రబృందం.