భారత్​-పాక్​ మ్యాచ్ ఎఫెక్ట్..సానియా మీర్జా కీలక నిర్ణయం

India-Pakistan match effect..Sania Mirza key decision

0
90

టీ20 ప్రపంచకప్​లో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధమవుతోంది టీమ్​ఇండియా. అక్టోబర్ 24న ఈ మ్యాచ్​ జరగనుంది. ఈ టోర్నీ కోసం కుటుంబసభ్యులు ఆటగాళ్లను కలిసేందుకు అనుమతించింది అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్. ఈ నేపథ్యంలో టెన్నిస్​ స్టార్​ సానియా మీర్జా దుబాయ్​కి చేరుకుంది. అక్కడే బయోబబుల్​లో ఉన్న తన భర్త, పాక్​ ఆటగాడు షోయబ్​ మాలిక్​ను కలిసింది.

కాగా.. ఆదివారం భారత్, పాకిస్థాన్​ మ్యాచ్​ నేపథ్యంలో సోషల్​ మీడియాకు దూరంగా ఉండనున్నట్లు సానియా ఇన్​స్టాలో పోస్ట్ చేసింది. అందుకు కారణం కూడా వివరించింది. సోషల్​ మీడియాలో ఆరోజు ఏదైనా పోస్ట్​ చేస్తే విపరీతంగా ట్రోల్స్​ వస్తాయని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

https://www.instagram.com/p/CVFkcBzjzDa/