ఆసియ కప్ లో భారత్ పాకిస్థాన్ యుద్ధం ఆ రోజే

0
84

క్రికెట్ అభిమానులారా ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సందర్భానికి సమయం రానే వచ్చింది. క్రికెట్ ప్రపంచంపై చెరుగని ముద్రవేసిన భారత్, పాకిస్థాన్ జట్లు ముఖాముఖి తలపడేందుకు సిద్ధమయ్యాయి. దుబాయ్, అబుదాబి వేదికలుగా జరిగే ఆసియాకప్ టోర్నీ షెడ్యూల్‌ను ఐసీసీ మంగళవారం అధికారికంగా విడుదల చేసింది. భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ ప్రాతినిధ్యం ఖరారు కాగా మరో స్థానం కోసం యూఏఈ, సింగపూర్, ఒమన్, నేపాల్, మలేసియా, హంకాంగ్ పోటీపడనున్నాయి. సెప్టెంబర్ 15న మొదలయ్యే ఆసియా కప్‌లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో 18న క్వాలిఫయర్‌తో ఆడుతుంది. ఆ మరుసటి రోజు జరిగే మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థి పాక్‌ను టీమ్‌ఇండియా ఢీకొంటుంది. ఒక్కో గ్రూపులో మూడు జట్లు పోటీపడనుండగా టాప్-2లో నిలిచినవి సూపర్-4లోకి అడుగుపెడుతాయి. సెప్టెంబర్ 28న దుబాయ్‌లో ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది.