ఆసక్తికరంగా టీ20 పోరు..రోహిత్, కోచ్ ద్రవిడ్‌లకు కీలకం కానుందా?

Interesting T20 fight..this series will be crucial for them ..

0
117

ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2021 ముగిసింది. ప్రపంచానికి ఆస్ట్రేలియా రూపంలో కొత్త టీ20 ప్రపంచ ఛాంపియన్ లభించింది. ఈ ప్రపంచకప్‌లో భారత్‌ ప్రదర్శన మాత్రం చాలా నిరాశపరిచింది. సూపర్‌-12 దశను కూడా దాటలేకపోయింది. అయితే ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు దుబాయ్‌ ప్రదర్శనను మరిచిపోయి శుభారంభం చేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.

టీ20లో జట్టుకు కొత్త కెప్టెన్‌, కోచ్‌లు జతకావడంతో ఈ పోరు చాలా ఆసక్తికరంగా మారింది. టీ20 ఫార్మాట్‌లో భారత జట్టుకు కొత్త కెప్టెన్‌గా రోహిత్ శర్మ ఎంపికయ్యాడు. అలాగే రాహుల్ ద్రవిడ్ జట్టుకు కొత్త కోచ్‌గా నియమితులయ్యారు. న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో ఇద్దరూ జట్టు బాధ్యతలు చేపట్టనున్నారు. జట్టును కొత్త కోణంలోకి తీసుకెళ్లాలని వీరిద్దరూ కోరుకుంటున్నారు.

మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్..
మొదటి మ్యాచ్ – బుధవారం, నవంబర్ 17న భారత్ వర్సెస్ న్యూజిలాండ్ సవాయ్ మాన్‌సింగ్ స్టేడియం, జైపూర్, సమయం – రాత్రి 7గంటలకు.

రెండవ మ్యాచ్ – శుక్రవారం, నవంబర్ 19న, భారత్ వర్సెస్ న్యూజిలాండ్, JSCA ఇంటర్నేషనల్ స్టేడియం రాంచీ, రాత్రి 7 గంటలకు.

మూడవ మ్యాచ్ – నవంబర్ 21 ఆదివారం, భారత్ వర్సెస్ న్యూజిలాండ్, ఈడెన్ గార్డెన్స్ స్టేడియం, కోల్‌కతా, రాత్రి 7 గంటలకు.

రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్
తొలి టెస్ట్ మ్యాచ్, నవంబర్ 25 నుంచి 29 వరకు, ఇండియా వర్సెస్ న్యూజిలాండ్, గ్రీన్ పార్క్ కాన్పూర్, ఉదయం 9:30 గంటలకు

రెండవ మ్యాచ్, డిసెంబర్ 3 నుంచి డిసెంబర్ 7 వరకు, భారత్ వర్సెస్ న్యూజిలాండ్, వాంఖడే స్టేడియం, ముంబై ఉదయం 9:30 గంటలకు మొదలుకానుంది.